పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. ఏదైనా సినిమా ప్రమోషన్ కు ఇంటర్వ్యూలు ఇవ్వటం మామూలే. కానీ.. పవన్ మాత్రం అలాంటివి అస్సలు చేయడు. సినిమా రిలీజ్ అయ్యాక మరీ తప్పదనుకుంటే.. ఒక ఇంటర్వ్యూ ను రూపొందించి.. దాని సీడీల్ని మిగిలిన ఛానల్స్ కు ఇచ్చేస్తారు. అంతేకానీ మిగిలిన వారి మాదిరి ఒక్కో మీడియా సంస్థకు కాస్త టైం ఇవ్వటమో.. లేదంటే ప్రెస్ మీట్ పెట్టటం లాంటివో అస్సలు చేయరు. అలాంటి పవర్ స్టార్.. తన తాజా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల సందర్భంలో జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అది కూడా సెలెక్టివ్ గానే. ఇంటర్వ్యూలు ఇవ్వటం లాంటి వాటికి దూరంగా ఉండే పవన్ ఇంటర్వ్యూలు ఇవ్వటమేమిటంటే.. తొలిసారి తెలుగు.. హిందీలో సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల కావటం.. దీన్ని ఈరోస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో తన తీరుకు భిన్నంగా ఇంటర్వ్యూలు ఇవ్వక తప్పలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. చర్చకు అస్కారమిచ్చేలా మాట్లాడటం గమనార్హం. మీడియాతో ఎలా మాట్లాడాలి..? ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి? అన్న విషయాలపై పవన్ కు చాలా ఎక్కువ స్పష్టతే ఉంది. ఏదైనా ఇష్యూ గురించి సందేహం ఉంటే.. ఆయా రంగాలకు చెందిన నిపుణులను.. మీడియా మిత్రులతో ప్రత్యేకంగా భేటీలు ఏర్పాటు చేసుకొని మరీ.. సదరు ఇష్యూలోని కోణాలన్నింటి మీద అవగాహన పెంచుకోవటం పవన్ కు అలవాటే. అంటే.. ఏదైనా అంశం గురించి ఆయన నోటి నుంచి సమాధానం వచ్చిందంటే.. అందులో చాలావరకూ అవగాహనతో చేసే వ్యాఖ్యలే తప్పించి.. అనుకోకుండా చేసే వ్యాఖ్యలు దాదాపుగా ఉండవనే చెప్పాలి.
తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ సందర్భంగా పలు కీలక అంశాల మీద ఆయన స్పందించారు. అసహనం అంశంలో అమీర్ చేసిన వ్యాఖ్యలు.. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఇలా చాలానే అంశాల విషయంలో తాను అనుకున్న విషయాల్ని కుండ బద్ధలు కొట్టేందుకు అస్సలు మొహమాట పడలేదు. నిర్మోహమాటంగా మాట్లాడటం పవన్ కు మామూలే అయినా.. సున్నితమైన అంశాల విషయంలోనూ అలాంటి విధానాన్ని పాటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమీర్ ఖాన్ ఆ మధ్య దేశంలో అసహనం పెరిగిపోతుందని.. తన భార్య తనతో దేశం విడిచి వెళ్లిపోదామని చెప్పటాన్ని ఆయన ప్రస్తావించటం.. అదో ఇష్యూ కావటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ మీద ప్రశ్న వేసినప్పుడు.. ప్రైవేటు విషయాల్ని..ఇంట్లో జరిగే సంభాషణల్ని జనరలైజ్ చేసి చెప్పటం సరికాదని తేల్చేశారు. అంతేకాదు.. ఒకసారి వ్యాఖ్యలు చేసిన తర్వాత పారిపోకూడదంటూ.. అమీర్ ఖాన్ ను ఎక్కడ ప్రశ్నించాలో అక్కడే సూటిగా వేలెత్తి చూపించారు.
ఇంత సూటిగా బాలీవుడ్ సూపర్ స్టార్ తప్పును ఎత్తి చూపటం అంత సింఫుల్ కాదు. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఇదే కాదు.. హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఇష్యూను రాజకీయ పార్టీలు హైలెట్ చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని చెప్పేశారు. సున్నితమైన అంశాల మీద మాట్లాడేందుకు సెలబ్రిటీలు ఏ మాత్రం ఇష్టపడరు. కానీ.. అందుకు భిన్నంగా పవన్ మాట్లాడేయటం చూస్తుంటే.. ఏదో లెక్క తప్పక ఉందన్నఅభిప్రాయం కలగక మానదు. బాలీవుడ్ దిగ్గజం అమీర్ ఖాన్ ను తప్పు పట్టటం ద్వారా బాలీవుడ్ లో పవన్ అందరి నోట్లో నానటం ఖాయం.