ఒకే ఒక్కడి ఎగ్జిట్ తో టీవీ9 లో చాలా మార్పులే కనిపిస్తున్నాయి. టీవీ9 అంటేనే పడని పవన్ కళ్యాణ్ లో చాలా మార్పు వచ్చింది. అంతేకాదు.. టీవీ9 యాజమాన్యం కూడా పవన్ విషయంలో ఈ స్టెప్ తీసుకోవడం సంచలనంగా మారింది.
అప్పట్లో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను తిట్టడం.. ఆయన తల్లిని అవమానించేలా మాట్లాడడం.. దానికి టీవీ9 కవరేజ్ ఇవ్వడం.. జరిగిపోయాయి. దీనిపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా రవిప్రకాష్, చైర్మన్ శ్రీనిరాజ్ పై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. టీవీ9కు అప్పటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు.
అయితే ఇటీవలే టీవీ9 నుంచి రవిప్రకాష్ నిష్ర్కమించారు. కొత్త మేనేజ్ మెంట్ ఆయనను సాగనంపింది. కేసులు కూడా పెట్టింది. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిలోనూ స్పష్టమైన మార్పు రావడం గమనార్హం.
తాజాగా పవన్ కళ్యాణ్ నంద్యాల వెళ్లి చనిపోయిన ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించాడు. పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో ఉండగా.. టీవీ9 రిపోర్టర్ వెళ్లడం చిన్న ఇంటర్వ్యూ కోరడంతో పవన్ ఇచ్చేశాడు. అంతకుముందు పవన్ టీవీ9ను దగ్గరకు రానీచ్చేవారు కాదు.. కానీ ఇప్పుడు రవిప్రకాష్ నిష్క్రమణ తర్వాత ఫలితాల గురించి. జనసేన అవకాశాల గురించి ఆ చానెల్ తో మాట్లాడడం విశేషం..
రవిప్రకాష్ ఎగ్జిట్ తర్వాత కొత్త మేనేజ్ మెంట్ పవన్ పట్ల సయోధ్యగా ఉందని స్పష్టమవుతోంది. తాజాగా మంగళగిరిలో పవన్ నేతల సమీక్ష ను కూడా టీవీ9 కవర్ చేసింది. రవి ప్రకాష్ ఉన్నప్పుడు పవన్ వార్తలే వచ్చేవి కావు. దీన్నిబట్టి పవన్-టీవీ9 మధ్య రవిప్రకాష్ దూరంతో సాన్నిహిత్యం పెరిగినట్టే కనిపిస్తోంది.