కృష్ణా జిల్లాలో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రమాదం జరిగి 11 మంది మరణించారని.. 30 మంది గాయపడ్డారని తెలియగానే తనకు నోట మాట రాలేదని.. తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. బాధిత కుటుంబాలకు మెరుగైన సాయం అందించాలని.. క్షతగాత్రులకు పూర్తి వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు తగినంత నష్టపరిహారం అందించాలని సూచించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
అదే సమయంలో ఆయన ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు కారణమవుతూ భారీ జన నష్టం కలిగిస్తున్నాయి.. నిబంధనల విషయంలో పక్కాగా ఉంటూ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
భద్రత పరమైన అంశాల్లో చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే ప్రజల ప్రాణాలకు రక్షణ దొరుకతుందని పవన్ అన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రోడ్డు ప్రమాదాల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకోవాలన్నారు. ఈ బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/