దేశంలో సంచలనంగా మారిన పెద్ద నోట్ల రద్దు అంశంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులు - సీనియర్ లీడర్లు తీవ్రంగా తప్పు పట్టగా చంద్రబాబు వంటివారు మద్దతు పలికారు. కేసీఆర్ వంటివారు పైకి మద్దతు పలికినా లోలోన రగిలిపోతున్నారు. అంత కీలకమైన ఈ విషయంలో జనసేనాధిపతి ఉద్దేశమేంటో తెలుసుకోవాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయన దీనిపై తన ఒపీనియన్ వెల్లడించారు. పనిలో పనిగా రాయలసీమ వాసుల మనసు దోచుకునే మాటలను చెప్పారు. ప్రభుత్వం కేవలం అమరావతిని అభివృద్ధి చేసి అనంతపురాన్ని వదిలేస్తే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు.
తన అనంతపురం జిల్లా పర్యటనలో వివిధ అంశాలపై మాట్లాడుతున్న ఆయన పెద్దనోట్ల రద్దు నిర్ణయంపైనా మాట్లాడుతూ దాన్ని సమర్థించారు. అవినీతి - నల్లధనం - నకిలీ నోట్ల నిరోధానికి ఇటువంటి నిర్ణయాలు ఉపయోగపడతాయని చెప్పారు. కట్టిన పన్నులతో ప్రభుత్వ ఆదాయం పెరిగి మళ్లీ అది జనాలకే అందితే ఎంతో సంతోషమని చెప్పారు.
మరోవైపు పవన్ కల్యాణ్ ను ఓ విద్యార్థి ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటారా? అని అడిగారు. దానికి సమాధానంగా పవన్ కల్యాణ్.. ''ఒక్క గ్రామాన్ని కాదు - మొత్తం అనంతపురాన్నే దత్తత తీసుకుంటా"నని అన్నారు. అంతటితో ఆగకుండా మొత్తం రాయలసీమను దత్తత తీసుకుంటానని చెప్పారు. అమరావతి అభివృద్ధికి ఎంతో డబ్బు ఖర్చుపెడుతున్నారు. అనంతపురాన్ని పట్టించుకోకపోతే నేను ఊరుకోను. అమరావతి అద్భుతంగా అభివృద్ధి జరిగి, అనంతపురం ప్రజలు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోనని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/