ర‌చ్చ వ‌ద్దు..ఫ్యాన్స్‌ కు ప‌వ‌న్ పిలుపు

Update: 2018-01-19 14:08 GMT
కొద్దిరోజులుగా ఇటు సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్‌ కు - అటు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఇది మ‌రింత ముదిరి భౌతిక దాడుల‌కు చేరింది. జన సేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి కీలక ప్రకటన చేసారు ఫాన్స్ అంతా సంయమనం పాటించాలని కోరారు. అంతే కాకుండా గతం లో అక్టోబర్ 7th, 2017 న పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసిన మరో ప్రకటన కూడా విడుదల చేసారు .. ఆ ప్రకటనలో పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు

``ప్రియ‌మైన మీకు...మనం పార్టీ అంతర్గత నిర్మాణంలో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నాము. ప్రజాసమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకు వెళుతున్నాము. ఈ తరుణంలో కొందరు పేరు కోసమో లేదా మన దృష్టిని మరల్చడానికో లేదా మనల్ని చికాకు పర్చడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటివాటిపై మీరెవ్వరు స్పందించవద్దని మనవి చేస్తున్నాను. వ్యక్తిగతంగా నాపై విమర్శలు చేసినా లేదా నాకు అపకీర్తి వచ్చేలా మాట్లాడినా మనం హుందాగానే ప్రవర్తిద్దాం. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా - భాద్యుతాయుతమైన రాజకీయ వ్యవస్థ ఆవిష్కారానికి జనసేన ధృడ నిశ్చయంతో ముందుకెళుతున్న విషయం మీ అందరకీ విదితమే. కులం - మతం - ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు పరిఢవిల్లాలని బలంగా నమ్మడమే కాదు ఆచరణలో చూపాలన్న నా ధృడ సంకల్పంలో ఆవిర్భవించిందే జనసేన పార్టీ. మానవత్వమే మతంగా - సమాజ హితమే అభిమతంగా రూపుదిద్దుకొంటోంది జనసేన. యువత భవిష్యత్తు - భావితరాల భవిష్యత్తు - సమాజ భవిష్యత్తు - దేశ భవిష్యత్తుకు విశాల ధృక్పథం కలిగిన రాజకీయాలు చాలా  అవసరమని జనసేన విశ్వ‌సిస్తోంది` అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

`ఇటువంటి తరుణంలో మనపై వచ్చే కువిమర్శలపై మీరు ఆవేశం చెందకండి. మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా ఒక్కోసారి హాని చేయవచ్చు. మనపై చేస్తున్న ప్రతి విమర్బను పార్టీ లెక్కగడుతూనే వుంది. అవి హద్దులు మీరుతున్నప్పుడు సమయం సందర్భం చూసి పార్టీ స్పందిస్తుంది. అంతవరకు మీరు ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్ళండి. హుందాగా పార్టీ కోసం పనిచేయండి. ఓర్పే మన పార్టీ కి రక్ష. జైహింద్.`
Tags:    

Similar News