తన దారిన తాను పోయే వాడిని గెలుక్కుంటే వచ్చే నష్టం అంతా ఇంతా కాదు. ఒక వేలితో విమర్శ చేస్తే.. నాలుగు వేళ్లు చూపిస్తాయి. మౌనంగా ఉన్నోడిని గెలికి.. గెలికితే ఏం జరుగుతుందో.. తాజాగా ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన జనసేనాధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్థమవుతాయి. గడిచిన ఆర్నెల్లుగా తనపై అదే పనిగా వస్తున్న విమర్శలు.. వ్యాఖ్యలు.. ప్రత్యేక చర్చల పేరుతో సాగుతున్న వ్యవహారంపై పవన్ తాజాగా ట్వీట్లతో దూసుకొచ్చారు.
తనపై సాగుతున్న కుట్ర కోణాన్ని బట్టబయలు చేసే ప్రయత్నాన్ని చేశారు. తనపై చేస్తున్న దాడికి సంబంధించిన వివరాల్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పవన్.. ఒక ప్రముఖ టీవీ యాంకర్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను పెట్టారు. అందులో సినిమా రంగంపై ఆయన విస్తుపోయే వ్యాఖ్య చేయటం ఉంది. నోటితో చెప్పలేని.. రాయలేని మాటను పోసానితో నిర్వహించిన చర్చ సందర్భంగా సదరు యాంకర్ వ్యాఖ్యానించటం గమనార్హం.
ఈ వీడియోక్లిఫ్ ను పోస్ట్ చేసిన పవన్.. సదరు ప్రముఖ యాంకర్ అంటే ఏపీ మంత్రి లోకేశ్ కు చాలా ఇష్టమని.. ఆయన్ను ఎంతో అభిమానంతో అంకుల్ అని పిలుస్తారని వ్యాఖ్యానించారు. ఒక ప్రముఖ ఛానల్లో చర్చలు నిర్వహించే ఆ పెద్ద మనిషి.. నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయన్నది తెలుగు ప్రజలకు బాగా తెలిసిన వేళ.. సదరు యాంకర్ అంటే లోకేశ్ కు ఉండే అభిమానం అని ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనార్హం. ఈ సందర్భంగా మీడియాపై ఆయన తీవ్ర విమర్శ చేశారు. ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములని.. కానీ ఇప్పుడు దొరలంటే మీడియా అసాములని.. వారు చెప్పిందే వేదమని.. వారు పాడిందే నాదమన్నారు పవన్.