ఈ మధ్య పవన్ చాలా సభలు సమావేశాలు చూస్తే జనాలకు ఏకి పారేస్తున్నారు. చైతన్యం మీలో లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణా సమాజం ఈ విషయంలో చాలా బెటర్ అని కూడా ఆయన కొన్ని సార్లు హార్ష్ గానే పోలిక తెచ్చి మాట్లాడారు. లేటెస్ట్ గా ఆయన్ అమరజీవి పొట్టి శ్రీరాములు సాక్షిగా మరోసారి ఆంధ్రుల మీద సెటైర్లు వేశారు.
ఏదీ మీలో ఆనాటి చైతన్యం అంటూ నిలదీశారు. అప్పట్లో వివక్ష భరించలేకనే పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు.నాడు ఎగిసిపడిన జన చైతన్యం ఇపుడు ఎందుకు కానరావడం లేదని ఆయన ఫైర్ అయ్యారు.
ఆనాడు పొట్టి శ్రీరాములు ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రాష్ట్రాన్ని సాధించారు. అని ఆయన గుర్తు చేశారు. మరి ఈనాడు జనాలు ఏం చేస్తున్నారు, ఆ ఆవేశం ఎక్కడికిపోయిందని ఆయన గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఏపీ అంతా అక్రమార్కుల చేతులలోకి వెళ్ళిందని రాష్ట్రం అతలకుతలం అయిపోతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్నా జనాలు మాత్రం పట్టనట్లు ఉండడం మీదనే ఆయన మండిపడుతున్నారు. కనీస స్పందన కూడా జనాలలో లేకుండా పోతోందని ఆయన అంటున్నారు.
ఇలా ఎన్నాళ్ళు చేష్టలుడిగి కూర్చుంటారు, ఎన్నాళ్లు ఇలా చోద్యం చూస్తారు అంటూ పవన్ ఘాటైన వ్యాఖ్యలతోనే ఆంధ్రులను అడిగేసి కడిగేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఒకవైపు ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూనే మరో వైపు పవన్ మాత్రం గట్టిగానే ఏసుకున్నారు.
దీనికి ముందు ఆయన నోటా ఓటర్లకు క్లాస్ తీసుకున్నారు. మీరంతా పలాయనం చిత్తగిస్తూ క్రిమినల్స్ కి రాజ్యం దక్కేలా సహకరిస్తున్నారు అని పవన్ మండిపడ్డారు. మొత్తానికి జనంలో నుంచి చైతన్యం రావాలన్నది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. మరి ఈ జనాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.