ఆరే సాంబ‌..ప‌వ‌న్ సారుకు అలా రాసిస్తున్నారేంట్రా?

Update: 2018-05-29 05:58 GMT
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. కానీ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌హాలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం ఏ రాజ‌కీయ నాయ‌కుడి వ‌ల్లా కాదేమో?  రాజ‌కీయాల మీద ఓనామాలు దిద్దే వారు సైతం సాధ్యం కాద‌ని చెప్పే అంశాల్ని.. ప‌బ్లిక్ మీటింగ్ ల‌లో చెప్పేయ‌టం.. ఆ త‌ర్వాత మీడియాకు రిలీజ్ చేసే ప్రెస్ నోట్ల‌లోనూ అలాంటి షాకింగ్ కామెంట్లు రాయ‌టం చూస్తే.. ఆరేవో సాంబ‌.. ప‌వ‌న్ సార్ స్పీచుల్ని రాసేటోళ్ల చేత కాసిన్ని పేప‌ర్లు రోజూ చ‌దివించండ్రా అనాల‌నిపించ‌క మాన‌దు.

ప‌వ‌న్ చేస్తున్న తాజా బ‌స్సు యాత్ర క‌మ్ పోరాట యాత్ర ప్ర‌స్తుతం అముదాల‌వ‌ల‌స‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప‌వ‌న్ ఊహించిన రీతిలో కామెంట్లు చేసి షాకిచ్చారు. ఏపీ అధికార‌ప‌క్షం జ‌త క‌ట్ట‌బోతోన్న పార్టీ గురించి చెప్పి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. ఇంత‌కీ టీడీపీ జ‌త క‌ట్టేది ఎవ‌రితోనో తెలుసా.. ?  వైఎస్సార్ కాంగ్రెస్ తో అంటూ ప‌వ‌న్ ఇచ్చిన స్టేట్ మెంట్‌ కు అక్క‌డున్న మీడియా మిత్రులంతా షాక్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేనా.. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ.. కాంగ్రెస్ రెండు పార్టీలు క‌లిసి ఉమ్మ‌డిగా బ‌రిలోకి దిగుతాయంటూ మ‌రో షాకింగ్ మాట‌ను చెప్పారు.

ఆ మ‌ధ్య‌న చంద్ర‌బాబు వీరావేశంతో మాట్లాడుతూ దేశాన్ని అవినీతిమ‌యం చేస్తానంటూ నోరు జార‌టం తెలిసిందే. అయితే.. అది స్పీచ్ కే ప‌రిమిత‌మైంది. కానీ.. తాజా ఎపిసోడ్‌ లో జ‌న‌సేన పార్టీ నేత‌లు త‌మ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిసి తెలియ‌కో చేసిన వ్యాఖ్య‌ల్ని ఏ మాత్రం మార్చ‌కుండా ప్రెస్ నోట్ల‌లోనూ అదే రీతిలో పంపిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇలా చిత్ర విచిత్ర‌మైన కాంబినేష‌న్ల‌లో పార్టీల మ‌ధ్య పొత్తులు ఉంటాయ‌ని చెప్పిన ప‌వ‌న్‌.. తెలుగుదేశం పార్టీ బీజేపీ.. కాంగ్రెస్ ల‌తో కూడా జ‌త క‌డుతుంద‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సైతం ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తాయ‌న్న మాట‌ను అన్యాప‌దేశంగా చెప్పేస్తున్న ప‌వ‌న్ తీరు చూస్తే.. ఆయ‌న‌కు ప్ర‌సంగాలు రాసి పెట్టే వారికి త‌క్ష‌ణ‌మే క్రాష్ కోర్సులు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్ని య‌థాత‌ధంగా ఆయ‌న ఫేస్ బుక్ లో ఉంచేశారు. దీనిపై ప‌లువురు నెటిజ‌న్లు స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్య‌ల్ని చేస్తున్నారు. ఇలాంటి వాటిని ప‌వ‌న్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. జ‌న‌సేన‌కులు కానీ.. ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా న‌మ్మి పెట్టుకున్న వారు కానీ  ఫేస్ బుక్ పేజీలో కామెంట్ల‌కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ప‌వ‌న్ కు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది.
Tags:    

Similar News