టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్... సినిమాల్లో నుంచి పాలిటిక్స్ లోకి వచ్చినా... తనదైన సినిమాటిక్ ట్విస్ట్ లను ఏమాత్రం వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదన్న మాట ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరికకు సంబంధించి సింగిల్ వర్డ్ కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డ పీకే... నేటి ఉదయం లక్ష్మీనారాయణకు పార్టీ కండువా వేసి అందరినీ షాక్ కు గురి చేశారు. తాజాగా... ఆది నుంచి తనతో కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపుతున్న వామపక్షాలను అలా అలా మెయింటైన్ చేస్తూనే... ఏకంగా యూపీకి వెళ్లి బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో పొత్తు కుదుర్చుకుని లెఫ్ట్ పార్టీలకు పెద్ద షాకిచ్చారనే చెప్పాలి.
తాజాగా లెఫ్ట్ పార్టీలకు ఏ మేర సీట్లను కేటాయిస్తానన్న విషయాన్ని ఇంకా తేల్చకుండానే... బీఎస్పీకి ఏకంగా 21 అసెంబ్లీ సీట్లతో పాటు 3 ఎంపీ సీట్లను కూడా కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా షాకుల మీద షాకులిస్తున్న పీకే.. ఎన్నికలు పూర్తయ్యేలోగా ఇంకెన్నీ షాకులు ఇస్తారోనన్న వాదన ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కథాకమామీషు చాలా పెద్దదిగానే ఉందన్న వాదన వినిపిస్తోంది. లక్నోలో నిన్న జరిగిన మాయావతితో భేటీ సందర్భంగానే సీట్ల సర్దుబాటుపైనా తుది నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. బీఎస్పీకి మూడు రిజర్వుడ్ స్థానాలను జనసేన పార్టీ కేటాయించింది. బాపట్ల, తిరుపతి, చిత్తూరు సీట్లలో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ మూడింట్లో బీఎస్పీకి చెందిన నాయకులు పోటీ చేస్తారా? లేక జనసేన పార్టీ సూచించిన వారినే బరిలో దింపుతారా? అనేది వెల్లడి కావాల్సి ఉంది.
దీనితో పాటు రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 21 సీట్లను బీఎస్పీకి జనసేన కేటాయించింది. ఏయే అసెంబ్లీ నియోజకవర్గాలనేది ఇంకా ఖరారు చేయలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ బీఎస్పీకి అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. లోక్ సభ తరహాలోనే ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ సీట్లనే బీఎస్పీకి ఇస్తారని చెబుతున్నారు. దీనికోసం జిల్లాలు, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలవారీగా సీట్ల వడబోతను జనసేన పార్టీ నాయకులు చేపట్టారట. ఒకటి, రెండు రోజుల్లో అసెంబ్లీ స్థానాలపై కసరత్తు పూర్తి చేస్తామని అంటున్నారు. మొత్తంగా ఈ తరహా కొత్త కొత్త ట్విస్టులతో పీకే తనదైన శైలిలో దూసుకెళుతున్నారనే చెప్పాలి.