అప్పుడు.. అమ్మ ఒడి.. ఇప్పుడు `జగనన్న అమ్మకానికో బడి`.. పవన్ హాట్ ట్వీట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై `పంచ్`లు పేల్చారు. ట్విట్టర్ వేదికగా.. తరచు కామెంట్లు చేసే పవన్.. తాజాగా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని.. బాలలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే చిన్నారులైన విద్యార్థుల పట్ల వైసీపీ అధినేత, సీఎం జగన్ `తొండి` వైఖరి అవలంబిస్తున్నారని.. విరుచుకుపడ్డారు. పదునైన పంచ్‌లతో పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికలకు ముందు.. `అమ్మ ఒడి` అని ఊరించిన జగన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. `అమ్మకానికో బడి` పథకాన్ని భేషుగ్గా అమలు చేస్తున్నారని.. విద్యార్థులను మానసికంగా కృంగదీస్తున్నారని విరుచుకుపడ్డారు.
తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఎయిడెడ్ విద్యాసంస్థల విలీన ప్రతిపాదనను.. పవన్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. నేటి బాలలే రేపటి పౌరులన్న విషయాన్ని తుంగలో తొక్కుతూ.. వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వ్యాఖ్యానించారు.
మాధ్యమంపై ముసుగు
విద్యార్థులు ఏ మీడియంలో చదువుకోవాలో కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని పవన్ అన్నారు. కనీసం వారికి ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే అవకాశం కూడా వారికి లేకుండా చేస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారని విమర్శించారు. చివరికి మా పాఠశాల తీసేయొద్దు అంటూ విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఎయిడెడ్ రగడ
పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసి, వారి చదువులపై దెబ్బ కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. పవన్ విరుచుకుపడ్డారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు నాలుగు అవకాశాలను ఇస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 12 న ఓ సర్కులర్ (Circular Memo No 1072635/CE/A1/2020) జారీ చేసిందని తెలిపారు. ఈ విధాన నిర్ణయం 2,200 స్కూళ్లను, 2 లక్షల మంది విద్యార్థులను, 6,700 మంది ఉపాధ్యాయులను; 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలను, దాదాపు 71 వేలమంది విద్యార్థులను, 116 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలను, దాదాపు రెండున్నర లక్షల విద్యార్థులు, సిబ్బందితో పాటు వారి కుటుంబాలను సైతం అతలాకుతలం చేసిందన్నారు.
ఇందులో విద్యా సంస్థలు, విద్యార్థులే ప్రధాన భూమిక పోషిస్తున్నారన్న అంశాన్ని ప్రభుత్వం మరచింది. విద్యార్థుల భవిషత్తును పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ నిర్ణయంతో విద్యార్థులే బలిపశువులుగా మారారు. విద్యార్థుల భవిషత్తును నాశనం చేస్తూ వైసీపీ ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరించింది?
ఎన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు పని చేస్తున్నాయి? ఈ అంశాలపై ఎస్.ఎం.సి.లు తమ తమ సమావేశాల్లో చర్చించాయా? అసలు ఈ పాఠశాలల్లో కమిటీలు లేని పక్షంలో ఈ నిర్ణయానికి విలువ ఉందా? ఇది ఆర్టీఈ సూత్రాలను ఉల్లంఘించినట్టు కాదా? అని పవన్ నిలదీశారు.
ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వంతో కలుపుకొనేందుకు లేదా స్వాధీనపరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది? విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా ఈ తెలివితక్కువ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
నిజంగా ఎయిడెడ్ పాఠశాలలను, టీచర్లను ఆదుకోవాలన్న ఉద్దేశముంటే వాటిని స్వాధీనపరుచుకోవడం ఒక్కటే మార్గమా? అసలు ఇంతకంటే మంచి నిర్ణయం, సరైన చర్యలు తీసుకొనే ఆలోచనలే కరవయ్యాయా? లేదా ప్రభుత్వానికి మరే ఇతర దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూసివేసిన పాఠశాలల్లో చదివే విద్యార్థులను దగ్గరలోని పాఠశాలలకు సంవత్సరం మధ్యలోనే తరలిస్తారా? ఇది వారి విద్యా సంవత్సరానికి ఆటంకం కలిగించదా? అని నిలదీశారు.
డీఎస్సీపై దొంగాట!
డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది? ప్రభుత్వ విద్యాసంస్థల లో ఖాళీ గా ఉన్న టీచర్ల పోస్టుల ను ఎప్పుడు భర్తీ చేస్తారు? పాఠశాల లను, కళాశాల లను స్వాధీన పరుచుకోవాలన్న నిర్ణయం తీసుకొనే ముందు టీచర్లను, లెక్చరర్లను నియ మించాలన్న ఆలోచన మీకు రాలేదా? అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరి గారు. మరి పవన్ ప్రశ్నల పై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.