శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాలక తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు పనుల్లేక - జీవనోపాధి లేక వలసలు వెళ్తున్నారని.. అక్కడ ఎన్నో అవమానాలకు గురవుతున్నారని.. సీఎం చంద్రబాబుకో.. ఇంతకుముందు పాలించిన కాంగ్రెస్ నేతలకో అవమానాలు జరగవని.. పేద వలస కార్మికులకే ఈ అవమానాలన్నీ అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వారు అనుసరిస్తోన్న విధానాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో జవాబుదారీతనం ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ఉత్తరాంధ్ర - రాయలసీమ వంటి నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి అన్నారు. టీడీపీ నేతలు వేసిన రోడ్ల పైనే ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తున్నారని లోకేష్ అంటున్నారని - ప్రజల డబ్బుతో ఆ రోడ్లు వేశారనే విషయం ఆయన మరిచిపోతున్నారన్నారు. అభివృద్ధి మొత్తం హైదరాబాద్ లో కేంద్రీకృతం చేసి గతంలో తప్పు చేశారని.. ఇప్పుడు కూడా అమరావతికే సర్వం ధారబోస్తూ మళ్లీ అదే తప్పు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలా అయితే మరోసారి ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాక తప్పదన్నారు.
ఉద్ధానంలో ఇన్ని వేల మంది ప్రజల జీవితాలు ఛిద్రం అవుతుంటే ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు మంత్రి అచ్చెన్నకు ఉద్దానం సమస్య ఎందుకు కనిపించలేదన్నారు. రమణదీక్షితులుకు చంద్రబాబు రిటైర్మెంట్ ఇచ్చారని - త్వరలో చంద్రబాబుకు ప్రజలు రిటైర్మెంట్ ఇస్తారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు 36సార్లు మాట మార్చారని, జనసేన ఒకే మాటపై ఉందన్నారు.