విశాఖ ఉక్కు ఉద్యమాన్ని రగిలించేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ఇప్పటికే సిద్ధమైంది.దీనిపై అటు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం రాజకీయ పార్టీలు, ఉక్కు కార్మికులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, దీక్షలు, పోరాటాలు చేస్తున్నాయి. 300 రోజులుగా అలుపెరగకుండా రోడ్డెక్కాయి. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, ఇతర పార్టీలు కార్మికులకు మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని జనసేన పార్టీ సైతం గతంలో పేర్కొంది. కార్మికులకు మద్దతు తెలిపింది.
కాగా ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు. ఎల్లుండి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ తోపాటుగా పీఏసీ సభ్యులు,జిల్లాల పార్టీల నేతలు దీక్ష చేయబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ దీక్షపై బీజేపీ, అధికార వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.