సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని జనసేన అధినేత.. ‘తమ్ముడు’ పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. నరసాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ చేసిన విమర్శలు ఒక ఎత్తు అయితే.. పనిలో పనిగా తన సోదరుడైన చిరంజీవిని ఉద్దేశించి ఆయన వాగ్భాణాలు సంధించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా వైసీపీ నేతల ఎదుటకు వచ్చి మోకరిల్లాలని పవన్ చేసిన వ్యాఖ్యలు.. చిరంజీవిని ఉద్దేశించేనన్న మాట వినిపిస్తోంది. చిత్రపరిశ్రమకు చెందిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక విమానంలో చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులంతా వెళ్లి సీఎం జగన్ తో భేటీ కావటం.. ఆ సందర్భంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను ఏపీ సీఎంవో విడుదల చేయటం తెలిసిందే.
అందులో ముఖ్యమంత్రి జగన్ ను ప్రస్తుతించిన చిరుపై పవన్ ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం జగన్ పెద్ద మనసుతో స్పందించాలన్న ఆయన అభ్యర్థనను చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. మెగాస్టార్ హోదాలో ఉన్న ఆయనకున్న ప్రజాదరణ ఎంతన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి అహం ప్రదర్శించకుండా ముఖ్యమంత్రిని వినయపూర్వకంగా విన్నవించిన వైఖరి పవన్ కు నచ్చలేదన్న విషయం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్థమవుతుందని చెప్పాలి.
సీఎం జగన్ కు అంత ఇగో ఎందుకని ప్రశ్నించిన పవన్ మాటల్ని చూస్తే.. ఇటీవల తన సోదరుడు చిరంజీవి వినయపూర్వకంగా మాట్లాడటాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని..రాచరికం రాదన్న పవన్.. తాను చావటానికైనా సిద్ధపడతాను కానీ తలవంచటానికి ఇష్టపడనని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సోదరుడు చిరు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ ముందు మోకరిల్లారన్న అర్థం వచ్చేలా పవన్ వ్యాఖ్యలు ఉండటం.. కోట్లాది మంది ఎన్నుకున్న ప్రజానేత ముందు వినయంతో వ్యవహరించటం తప్పేం కాదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. తన అన్న చిరు తనకు దైవ సమానమని చెప్పే పవన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు నొచ్చుకునేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేకున్నా.. ముఖ్యమంత్రి ఇమేజ్ ను దెబ్బతీసే క్రమంలో.. తన అన్న ఇమేజ్ కు కూడా దెబ్బ పడేలా పవన్ తీరు ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.