పవర్ స్టార్ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుండటం అనే కొత్త రీతిని ఫాలో అవుతున్నారని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. గత కొద్దినెలల నుంచి రాష్ట్రంలో వరసగా నిర్వహిస్తోన్న సభల లక్ష్యమేమిటన్నది అనంతరపురం బహిరంగసభతో తేలిపోయింది. ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటుగా కేంద్రమంత్రి - రాష్ట్రంలో బీజేపీకి కర్త - కర్మ - క్రియగా ఉన్న వెంకయ్యనాయుడు తీరును తూర్పార పట్టడం అనుబంధ టార్గెట్ అని అంటున్నారు. అయితే పవన్ ప్లానింగ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ రాజకీయాల్లో పోటీ చేయడంపై అభిమానుల్లో కొంత సందేహం ఉండేది. అయితే అనంతపురం సభలో ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించేశారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రాంతాల వారీగా సభలు నిర్వహిస్తున్న పవన్ ఇప్పటివరకూ కేంద్రాన్ని - బిజెపిని మాత్రమే విమర్శిస్తూ వచ్చారు. కేంద్రం ఏపి ప్రజలను మోసం చేస్తోందని - ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అని గతంలో విరుచుకుపడ్డారు. వెంకయ్యకు ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శరపరంపరగా జరుగుతున్న సన్మానాలను లక్ష్యంగా చేసుకుని పవన్ తాజాగా విమర్శనాస్త్రాలు సంధించడం గమనార్హం. ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారు? అహో ఆంధ్రభోజా అని ఎలా సన్మానాలు చేస్తారని నిలదీశారు. ప్యాకేజీపై ఇచ్చిన నిధులపై జైట్లీ-వెంకయ్య చెప్పిన అంకెలనూ ఎత్తిచూపిన పవన్ వెంకయ్యను సమర్థిస్తోన్న బాబుపైనా చురకలు అంటించారు. ప్యాకేజీని బాబు ఎలా స్వాగతిస్తారని - లోపాలున్న ప్యాకేజీని తెదేపా ఎలా మెచ్చుకుంటుందని పవన్ ప్రశ్నించారు. వ్యక్తిగతంగా వెంకయ్యనాయుడు మీద మాటల దాడి చేస్తూ ఇటీవలి కాలంలో జరుగుతున్న సన్మానాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలతో కూడిన వ్యంగ్యాస్త్రాలు సంధించటం బట్టి - పవన్ లక్ష్యం బీజేపీ కాదని - వెంకయ్యనాయుడు మాత్రమేనన్న విషయం స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పవన్ ప్రసంగశైలి నిశితంగా పరిశీలిస్తే, ఆయన లక్ష్యం బీజేపీ కాకుండా కేవలం వెంకయ్యనాయుడు మాత్రమేనన్న విషయం స్పష్టమయిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి ఏపీ బీజేపీ వెంకయ్య కనుసన్నులలో ఉండటం - ఒకే వర్గానికి ప్రాధాన్యం లభిస్తుండటంతో మిగిలిన సామాజికవర్గాలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రిపై పవన్ కొనసాగిస్తోన్న మాటల దాడి వారిని సంతోషపెట్టింది. దీంతో వెంకయ్యపై పవన్ చేసిన విమర్శలను రేపు ఎవరు ఖండిస్తారో, ఎవరు ఎదురుదాడి చేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.తాజా పరిణామాలను బట్టి చూస్తే పవన్ విమర్శలను బిజెపిలోని కాపు నేతలు ఖండిస్తారా? కమ్మ సామాజికవర్గ నేతలు ఎదురుదాడి చేస్తారా? చూడాలని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మాత్రం పవన్ వ్యాఖ్యలను తమ ప్రభుత్వం - పార్టీ గౌరవించి పరిగణనలోకి తీసుకుంటుందని మాత్రం వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/