వైసీపీ సర్కార్ ను మళ్లీ టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

Update: 2021-09-27 04:18 GMT
రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ మంత్రులు, సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరిగింది. కౌంటర్ గా నిన్న ఏపీ మంత్రులు పవన్ పై విరుచుకుపడ్డారు. లెక్కలు, పత్రాలతో సహా ఎండగట్టారు.

ఈ క్రమంలోనే మళ్లీ పవన్ స్పందించారు. తాజాగా వైసీపీ సర్కార్ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు , వాగ్ధానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్.

మద్యపాన నిషేధం, కరెంట్ చార్జీలు, ఉద్యోగాల భర్తీ, రాజధాని అంశం ఇలా ఎన్నో వాగ్ధానాలను వైసీపీ పార్టీ ఇచ్చిందని.. కానీ వాటిలో ఏ ఒక్క వాగ్ధానాన్ని కూడా అమలు చేయలేదని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.

ఇక మరో ట్వీట్ లోనూ పవన్ విమర్శలు గుప్పించారు. ‘‘ప్రజలు మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’ అంటూ పవన్ మండిపడ్డారు.

అంతేకాదు.. వాగ్ధానాలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని తీవ్రస్తాయిలో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ వరుస ట్వీట్లు చేస్తూ పవన్ విరుచుకుపడ్డారు.
Tags:    

Similar News