అంత ద‌మ్ము.. ధైర్యం ప‌వ‌న్ లో ఉన్నాయా?

Update: 2018-01-22 05:05 GMT
అర్థ‌మైన‌ట్లుగా అనిపిస్తూనే ఏ మాత్రం అర్థం కాన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లో క‌నిపిస్తుంది. ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి మాట‌లు చెప్పిన‌ప్పుడు ఎంతో సుప‌రిచితుడ‌న్న‌ట్లుగా క‌నిపించే ప‌వ‌న్‌.. అంత‌లోనే అంతే అపరిచితుడిగా క‌నిపిస్తుంటారు. విష‌యం ఏదైనా స‌రే.. సూటిగా మాట్లాడ‌తార‌న్న ఇమేజ్‌ ను సొంతం చేసుకోవ‌టంతో పాటు.. అంతులేని ఆవేశంతో ఎవ‌రినైనా స‌రే.. ఎంత మాట అయినా అనేసే ద‌మ్ము.. ధైర్యం త‌మ అరాధ్య‌దైవం ప‌వ‌న్‌ కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని ఆయ‌న అభిమానులు చెబుతుంటారు.

ఇందుకు త‌గ్గ‌ట్లే ఇప్ప‌టికే ప‌లుమార్లు మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరిగిన ఆయ‌న‌.. ఏపీ స‌ర్కారుకు ప‌లుమార్లు అల్టిమేటం జారీ చేశారు. మోడీ అండ్ కోపై ఘాటైన విమ‌ర్శ‌లు చేసిన త‌ర్వాత కూడా ఎలాంటి త‌నిఖీలు ఎదుర్కోని ప్ర‌ముఖుడిగా ప‌వ‌న్‌ ను చెప్పాలి. మ‌రి.. అలాంటి ప‌వ‌న్ ఈ రోజు నుంచి మ‌రో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు.

హైద‌రాబాద్ లో త‌న పార్టీ కార్యాల‌యం నుంచి బ‌య‌లుదేర‌నున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న తాజా టూర్ ను మీడియాకు ప్ర‌క‌ట‌న రూపంలో అంద‌జేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప‌వ‌న్ చేస్తున్న ప‌ర్య‌ట‌న ఇదేన‌ని చెప్పాలి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన ప‌వ‌న్‌.. త‌న తాజా ప‌ర్య‌ట‌న‌లో ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన ముఖ్య‌మంత్రి క్యాంప్ ఆఫీసులో క‌లిసి.. తెలంగాణ స‌ర్కారు ప‌ని తీరుపై కాంప్లిమెంట్స్ ఇచ్చిన ప‌వ‌న్‌.. త‌న తాజా ప‌ర్య‌ట‌న‌లో తెలంగాణ అధికార‌ప‌క్షంపై ఎలాంటి విమ‌ర్శ‌లు సంధిస్తార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది. ఏపీ ప‌ర్య‌ట‌న ద్వారా తాను ఆ రాష్ట్ర అధికార‌ప‌క్షానికి విధేయుడినేన‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో చెప్పేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌ని ప‌వ‌న్‌.. సీఎం కుర్చీలో కూర్చునే వారికి అనుభ‌వం అవ‌స‌రమ‌న్న మాట‌ను ప‌దే ప‌దే చెప్ప‌టంతో పాటు.. విప‌క్ష నేత జ‌గ‌న్ పై ఆకార‌ణంగా విమ‌ర్శ‌లు చేయ‌టాన్ని మ‌ర్చిపోలేం.

మ‌రి.. తాజా ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ స‌ర్కారు ప‌ని తీరును ప‌వ‌న్ ఏ విధంగా వ్యాఖ్యానిస్తార‌న్న దానిపై ప‌వ‌న్ లో ద‌మ్ము.. ధైర్యం ఎంత‌న్న‌ది తెలుసుకోవ‌చ్చ‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క‌భూమిక పోషించిన కోదండం మాష్టారి లాంటి వారు సైతం కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌టంతో పాటు.. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పైనా త‌న అభ్యంత‌రాల్ని ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఇక‌.. కాంగ్రెస్ అయితే ఎంత తీవ్రంగా రియాక్ట్ అవుతుందో తెలిసిందే. ఇలాంటివేళ‌.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేస్తారా?  లేక‌.. పార్టీ అభిమానుల‌తో త‌న గ‌తం గురించి.. త‌న రాజ‌కీయ అనుభ‌వాల్ని.. తాను నేర్చుకున్న పాఠాల్ని చెప్ప‌టంతో ప‌రిమితం చేస్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఏమైనా.. తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. తాను చేసే వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న‌కున్న ద‌మ్ము.. ధైర్యం ఎంత‌న్నది క్లారిటీ వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News