ఇటీవల సైరా సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి ఏపీలోని రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడి కథను దేశానికి చూపించారు. అయితే ఇదే ఏపీని పాలిస్తున్న జగన్ కు చూపించాలని చిరు ఆశించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి మరీ జగన్ ను కలిశారు. ఈ క్రమంలో అమరావతిలోని పవన్ ఇంటికి వెళ్లడం.. అక్కడే రెడీ కావడం.. పవన్ కళ్యాణ్ సమకూర్చిన కారులోనే జగన్ ఇంటికి వెళ్లి భేటి కావడం మెగా ఫ్యాన్స్ లో చర్చోపచర్చలకు దారితీసింది.
జగన్ ను రాజకీయంగా తీవ్రంగా విమర్శించే పవన్ కళ్యాణ్.. ఇలా అన్నయ్య చిరంజీవి అదే జగన్ తో భేటికి అన్ని సమకూర్చడం.. పవన్ ఇంటి నుంచే చిరంజీవి ఏకంగా జగన్ ఇంటికి వెళ్లడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే చిరంజీవి-జగన్ భేటి తర్వాత వారు ఏం మాట్లాడుకున్నారనే విషయం మాత్రం బయటకు పొక్కలేదు. పైకి సైరా సినిమా చూడాలని జగన్ ను కోరడానికే చిరంజీవి వెళ్లాడని తెలుసు. కానీ తెలుగునాట అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిరు-జగన్ ల భేటిలో ఏం మాట్లాడుకున్నారన్నది ఎవ్వరికీ తెలియదు. అటు జగన్ చెప్పరు. ఇటు చిరంజీవి నోరు మెదపరు.
కానీ ఈ దీపావళి సందర్భంగా అన్నాదమ్ములు చిరంజీవి-పవన్ కళ్యాణ్ కలిశారు. కుటుంబానికి ఎప్పుడూ దూరంగా ఉండే పవన్ ఈసారి మాత్రం దీపావళికి చిరంజీవి ఇంటికి వచ్చాడు. వీరిద్దరూ తనివితీరా మాట్లాడుకున్నారు. సంతోషంగా గడిపారు. అయితే జగన్ తో భేటి విషయాలు కూడా చిరంజీవి ఈ సందర్భంగా పవన్ తో చర్చించినట్టు వార్తలొస్తున్నాయి. ఏం మాట్లాడుకున్నారు? రాజకీయాలు సహా భేటి పూర్వపరాలన్నీ తమ్ముడికి చిరంజీవి చెప్పి ఉంటాడన్న ప్రచారం ఫ్యాన్స్ లో జరుగుతోంది.
ఏదీ ఏమైనా చిరు-జగన్ భేటిలో జరిగిన విషయాలు ఇప్పుడు పవన్ కు తెలిసిపోయాయని అర్థమవుతోంది.. మరి పవన్ మున్ముందు జగన్ తో అలానే వ్యవహరిస్తారా? లేక రూట్ మార్చుకుంటారా అన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.