వరుస పెట్టి నాలుగు రోజులు తిరిగితే.. మళ్లీ పది రోజుల పాటు కనిపించకుండా ఉండే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓపక్క తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వాడీ వేడిగా సాగుతుంటే.. తనకే మాత్రం పట్టనట్లుగా ఉంటున్న పవన్.. ఇప్పటికి తన దృష్టి మొత్తం ఏపీ మీదే అన్న విషయాన్ని అర్థమయ్యేలా తన తాజా వ్యాఖ్యలతో చెప్పారని చెప్పాలి.
రాజమహేంద్ర వరంలోని ధవళేశ్వరం బ్యారేజీపై తాను నిర్వహించబోయే కవాతుతో దేశవ్యాప్తంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటారని పవన్ వెల్లడించారు. బెజవాడలో పార్టీ నేతలతో భేటీ అయిన పవన్.. తూర్పుగోదావరి జిల్లా పార్టీకి ఆయువుపట్టుగా అభివర్ణించారు.
రానున్న రోజుల్లో జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో దాదాపు 20 నుంచి 22 రోజుల పాటు పర్యటిస్తానని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో తన పర్యటన పూర్తి అవుతుందని.. ఆ వెంటనే తూర్పు గోదావరి జిల్లాలో తన పర్యటన ఉంటుందని చెప్పారు.
ఈ నెల 15న కవాతు కార్యక్రమం ఉంటుందని.. భారీ కవాతుతో తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టి అదరగొడతామని చెబుతున్నారు పవన్ కల్యాణ్.పార్టీలో కోటరీలకు తాను వ్యతిరేకమని చెబుతున్న ఆయన పితాని బాలకృష్ణకు మినహా పార్టీలో ఎవరికి సీటు ఇవ్వలేదని పవన్ స్పష్టం చేశారు. టికెట్లు ఇప్పిస్తానని ఎవరైనా చెబితే అస్సలు నమ్మొద్దన్న పవన్.. టికెట్ కేటాయింపులో పారదర్శకత ఉంటుందని చెప్పారు.
పార్టీ నిర్మాణం ఆల్యమైనా పక్కాగా ఉంటుందని చెబుతున్న పవన్..తనతో సహా పార్టీలో ఎవరికీ ఎలాంటి అధికారాలు ఉండవని చెప్పారు. పదవులు రూపంలో బాధ్యతలు మాత్రమే తీసుకుంటామని... పార్టీ పదవి అంటే బాధ్యతగా అభివర్ణించారు. ఏమైనా లోపాలు ఉంటే చెప్పాలన్న పవన్.. త్వరలో తాము చేపట్టే కవాతుతో అందరి దృష్టి తమ మీద పడటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
Full View