జనసేన పార్టీ అధినేత - సినీనటుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ దూకుడు పెంచుతున్నారు. ఓవైపు సినిమాలు చేయనని ప్రకటించిన జనసేనాని అదే రోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అభిమానుల ఓట్లను కైవసం చేసుకోవడం, వారిని నిరాశకు గురిం చేయకుండా ఉండేందుకు పొరుగు రాష్ర్టాల టూర్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయన, తనకు అభిమానులున్న తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపే క్రమంలో పొరుగు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సినీనటుడు కం రాజకీయవేత్త అయిన కమల్ హాసన్ తో భేటీ కానున్నారు.
కొద్ది రోజుల క్రితం యూపీ మాజీ సీఎం - బీఎస్పీ అధినేత మాయావతితో భేటీ అయ్యేందుకు యూపీ వెళ్లిన విషయం తెలిసిందే.కాగా అనివార్య కారణాలతో వీరి భేటీ సాధ్యం కాలేదు. మరి కమల్ తో పవన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుధవారం ఉదయం చెన్నై చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేరుగా విలక్షణ నటుడు - మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఇంటికి బయలుదేరారు. దేశ రాజకీయ పరిణామాల పై చర్చించేందుకే పవన్ కమల్ తో భేటీకానున్నట్లుగా సమాచారం. కాగా, ఈ మధ్యాహ్నం పవన్ కల్యాణ్ - హోటల్ కన్నెమెరాలో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడతారు. ఈ సమావేశంలో పవన్ కీలక ప్రకటన చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
కాగా, గతకొన్నిరోజులుగా పవన్ మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పుంకానుపుంకాలుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఆయన తో పాటు వరుణ్ తేజ్ లేదా సాయిదరమ్ తేజ్ కూడా నటిస్తారని - సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబీ లేదా గోపాల గోపాల - కాటంరాయుడు చిత్రాలకు దర్శకత్వం వహించిన డాలిల్లో ఒకరికి దర్శకత్వ అవకాశం లభిస్తుందని కూడా ప్రచారం సాగుతోంది. పవన్ రాజకీయ లక్ష్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్ళేందుకనువైన కథనం సిద్దమైందని కూడా ప్రచారం సాగింది. ఆయన సినిమాలో నటిస్తారన్న వార్తల పట్ల అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తినా ఎన్నికలు తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయనకంత సమయం ఉండదంంటూ కొందరు జనసేన నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ దశలో పవన్ జారీ చేసిన ప్రకటనతో ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని తేలిపోయాయి.