రాజకీయాలంటే ఇష్టమని.. రాజకీయాలంటే ఇప్పుడున్నవి, అంతా అనుకుంటున్నవి కాదని.. ప్రజలకు సేవచేసే, జాతీయ సమైక్యతను చాటిచెప్పే రాజకీయాలు చేస్తానని.. ఇదే క్రమంలో బ్రతకడం కోసం సినిమాలు కూడా చేస్తానని సీరియస్ గా చెప్పిన పవర్ స్టార్ - జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తాజాగా సమస్యల్లో ఉన్న ప్రజలను కలిశారు. ప్రజాసమస్యలపై స్పందించడం, ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడం రాజకీయ నాయకుడి ప్రధాన కర్తవ్యం. ఇందులో భాగంగా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలను పవన్ కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన అధినేత... అభివృద్ధి కారణంగా ప్రజలు పురోగతి చెందాలే తప్ప భయంతో బతక్కూడదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మెగా అక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలు కలిసిన సందర్భంగా మాట్లాడిన పవన్... అభివృద్ధి ఎంత ముఖ్యమో - ప్రజా సమస్యలు కూడా అంతే ముఖ్యమని, కాకినాడ సభలోనే ఈ అంశంపై తనకు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తున్నానని, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఇదే సమయంలో పారిశ్రామికాభివృద్దికి జనసేన పెద్దపీట వేస్తుందని పవన్ చెప్పారు.
హైదరాబాదులో జనసేన కార్యాలయంలో ఆయనను కలిసేందుకు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలను ఆయన కలిశారు. కాగా, పవన్ ను కలిసిన ఈ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు... ఈ పార్క్ వల్ల 30 గ్రామాలు తీవ్ర కాలుష్యానికి గురవుతాయని, 30 గ్రామాల ప్రజలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏం చేయాలో తమకు తెలియడం లేదని, మీరే సాయం చేయాలని వారంతా పవన్ ను కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/