ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ కార్పొరేట్ స్థాయి యూనిఫాం, షూలు, పుస్తకాలు అందించాలన్న ఉద్దేశంతో `జగనన్న విద్యా కానుక`ను అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. పుస్తకాలు, యూనిఫాం, షూలతో కూడిన కిట్ బ్యాగులను విద్యార్థులకు ఇటీవలే అందించారు. 'జగనన్న విద్యా కానుక' గురించి వైసీపీ నేతలు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ పథకానికి పెట్టిన పేరుపై పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'జగనన్న గారి కానుక' అనేకంటే కూడా 'మోదీ-జగనన్న గారి కానుక' అని ఈ పథకానికి పేరు పెట్టి ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ పథకంలో 60 శాతం కేంద్ర నిధులు, 40 శాతం రాష్ట్ర నిధులు ఉన్నాయని గణాంకాలతో సహా పవన్ ట్వీట్ చేశారు.
‘జగనన్న విద్యా కానుక’ పథకం ద్వారా రాష్ట్రంలోని 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథఖం కోసం ఏపీ సర్కారు సుమారు రూ.650 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే, ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ లో కేటాయించిన నిధుల గణాంకాలను పవన్ వెల్లడించారు. ఈ పథకం కోసం రూ.390 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా అని, రూ.260 కోట్లు రాష్ట్రం వాటా అని పవన్ లెక్క తేల్చారు. ఈ పథకం పేరును విపరీతంగా ప్రచారం చేసి మైలేజీ తెచ్చుకోవాలని చూస్తున్న వైసీపీకి పవన్ షాకిచ్చారు. కేంద్రం వాటా అన్న పాయింట్ ను పవన్ తెరపైకి తేవడంతో వైసీపీ నేతలు కూడా ఆ వాదనను కాదనలేని సంకటస్థితిలో పడ్డారు. వాస్తవానికి ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ తరహా పాయింట్ తో ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టలేదు. మరి, పవన్ ను చూసైనా ఈ విషయాన్ని బీజేపీ నేతలు హైలైట్ చేసి....ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ‘జగనన్న విద్యాకానుక’పై పవన్ లాజిక్...బీజేపీ నేతలు మిస్సయ్యారే అన్న చర్చ జరుగుతోంది.