కోజికోడ్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం క్రాష్ కావటం.. పందొమ్మిదిమంది మరణించటంతో పాటు.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విమానాన్ని నడిపిన ఇరువురు పైలెట్లు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే.. తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసన్నారు. వాయుసేనలో సాథే అందించిన సేవలు.. చూపిన ధైర్య సాహసాలు ఎప్పటికి మర్చిపోలేమన్న పవన్.. విమానం ప్రమాదానికి గురి కావటం దురదృష్టకరమని పేర్కొన్నారు. అంత అనుభవం ఉన్న పైలెట్ నడిపిన విమానం ప్రమాదానికి గురి కావటంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేశారు.
ప్రయాణం చివరి క్షణాల్లో ఊహించని ప్రమాదం జరగటం విధి వైపరీత్యమన్న పవన్.. గల్ప్ నుంచి ప్రయాణం చేసిన వారు తమ మాతృగడ్డపై కాలు మోపే లోపే ప్రాణాలు కోల్పోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిమానాన్ని నడిపిన పైలెట్ వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే.. కెప్టెన్ అఖిలేష్ కుమార్ లు ఇద్దరు విమానయానంలో ఎంతో అనుభవం ఉందన్నారు.