దాదాపు ఐదు రోజుల తర్వాత కాపుల్ని బీసీల్లోకి చేర్చాలంటూ జరుగుతున్న ఆందోళనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళం విప్పారు. కాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకొని.. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నవేళ పవన్ తన ట్వీట్ తో తెలుగుదేశం సర్కారుకు తన సందేశాన్ని పంపారు. కాపు రిజర్వేషన్ ఇష్యూ మీద మాట్లాడి.. షూటింగ్ కు వెళ్లిపోయినా తాను అన్ని విషయాన్ని గమనిస్తున్నానన్న విషయాన్ని చెబుతూ.. బాబు సర్కారుకు కీలక సూచనలు చేసే ప్రయత్నం చేశారు.
ముద్రగడ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకొని.. వాతావరణం వాడివేడిగా తయారవుతున్న సమయంలో పవన్ మరోసారి రియాక్ట్ అయ్యారు. ఓపక్క కాపుల రిజర్వేషన్ల అంశం పట్ల తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యను పరిష్కరిస్తామని చెబుతుంటే.. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో పవన్ ఎంట్రీ ఇవ్వటమే కాదు.. సమస్యకు పరిష్కారం సూచించే ప్రయత్నం చేశారని చెప్పాలి.
కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుచేయటం.. సమస్య మరింత జటిలం కాకముందే.. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలన్న సూచన చేశారు. సమతుల్యతతో వ్యవహరించే మేధావుల బృందాన్ని ఈ అంశం పరిష్కారానికి ఏర్పాటు చేయాలని చెప్పటంతో పాటు.. కాపు నేతలతో నేరుగా చర్చలు జరపాలన్న విషయాన్ని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆలస్యమైందని.. ఇక వెంటనే రియాక్ట్ కావాలన్న విషయాన్ని ఏపీ సర్కారుకు పవన్ ట్వీట్ చెప్పకనే చెప్పిందని చెప్పొచ్చు.