జనసేనాని అనంత టూర్ ముగించుకుని కర్ణాటకలో ఎంటరవుతున్నారు. మూడు రోజుల పాటు అనంతలో పర్యటించిన పవన్ .. అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు - స్థానిక - రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హిందూపురం లో పవన్ ను ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్ధులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విద్యార్ధులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. హిందూపురం నుంచి పవన్ కర్ణాటక లోని చిక్ బళ్లాపూర్ వెళ్లనున్నారు. అక్కడ సీవీవీ కాలేజీ విద్యార్ధులతో పవన్ సమావేశం కానున్నారు.
కాగా అనంతలో తన మూడో రోజు పర్యటనలో పవన్ ధర్మవరంలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పవన్ ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణతో భేటీ అయ్యారు. చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేతో చర్చించారు. పవన్ తన అనంత పర్యటనలో టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతుండడం ఆసక్తి రేపుతోంది. జేసీ ప్రభాకర చౌదరి - పరిటాల సునీత - అత్తార్ చాంద్ బాషా - సూర్యనారాయణలతో భేటీ అయ్యారు.
కాగా ధర్మవరంలో చేనేత కార్మికులతో ముఖాముఖి సందర్భంగా పవన్ అనంతపురాన్ని దేశంలోనే బలమైన జిల్లాగా మార్చాలని అన్నారు. కులాలు - మతాలు - ప్రాంతాలకతీతంగా అందరికీ న్యాయం జరగాలన్నారు. అందరికీ జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. నా అభిమానులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, మీకేమైనా జరిగితే మీ అన్నగా తనకు బాధ ఉంటుందన్నారు.