ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించే తత్వం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లో కనిపిస్తుంది. అలాంటిది తనను విపరీతంగా అభిమానించే వారికి ఏదైనా జరిగితే ఆయన అస్సలు తట్టుకోలేరు. తాజాగా తిరుపతికి చెందిన తన అభిమాని ఒకరు కర్ణాటకలోని కోలార్ లో హత్యకు గురైన నేపథ్యంలో.. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ తిరుపతికి వెళుతున్నారు. ఇంతకూ పవన్ అభిమాని ఎందుకు హత్యకు గురయ్యారన్న విషయంలోకి వెళితే.. తిరుపతికి చెందిన వినోద్ ఐదురోజుల క్రితం (ఆదివారం) కర్ణాటకలోని కోలార్ నగరంలో ఒక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా అవయువ దానం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లోనూ విస్తరిస్తామంటూ వినోద్ చెబుతూ.. పవన్ కు వీరాభిమాని అయిన ఆయన పేరును జై కొట్టారు. దీంతో.. మరో హీరో అభిమాని దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడే వారి మధ్య గొడవ మొదలైంది. అనంతరం వినోద్ తన స్నేహితుడితో కలిసి దగ్గర్లోని హోటల్ కు వెళ్లారు.
అక్కడున్న సమయంలో.. మరో హీరో అభిమాని గొడవ పడటం.. అదికాస్తా పెద్దదైంది. దీంతో పవన్ అభిమాని వినోద్ ను అక్షయ్ కుమార్ అనే వ్యక్తి కత్తితో పొడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని వైద్యసాయం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. వినోద్ ను కత్తితో పొడిచిన అక్షయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వినోద్ కుటుంబాన్ని పరామర్శించటానికి ఈ రోజు తిరుపతికి వెళ్లనున్నారు. అభిమాన నటుల మీదున్న అభిమానం గొడవ వరకూ వెళ్లటమే కాదు.. హత్యకు దారి తీసిన ఉదంతంపై పరామర్శకు వస్తున్న పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.