వెనక్కు తగ్గని పవన్

Update: 2023-07-13 09:35 GMT
తన ఆరోపణ పై వాలంటీర్లలో ఇంతటి వ్యతిరేకత కనబడుతున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనక్కుతగ్గటంలేదు. పైగా మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ తాజాగా మాట్లాడుతు హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం వాలంటీర్లు రెక్కీ నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు.

కోడిపిల్లల ను గద్దలు తన్నుకు వెళ్ళినట్లుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో వాలంటీర్లు మరింతగా భగ్గుమంటున్నారు. వాలంటీర్ల వ్యవస్ధ హెడ్ ఆఫీసు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ లో పనిచేస్తోందన్నారు. అందులో 700 మంది ఉద్యోగులున్నట్లు పవన్ చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆడవాళ్ళు మిస్సవుతున్నారంటే దానర్ధం వాళ్ళంతా హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతున్నట్లు కాదు. పవన్ కు ఈ విషయం లో ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు. కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారమే మిస్సవుతున్న ఆడవాళ్ళ సంఖ్యలో ఏపీ ది 11వ స్ధానం. ఏపీ లో కన్నా ఎక్కువగా తెలంగాణా లో ఆడవాళ్ళు ఎక్కువమంది మిస్సవుతున్నారు. అందుకనే దేశవ్యాప్త జాబితా లో తెలంగాణా ఆరవ స్ధానం లో ఉంది.

రాష్ట్రంలో పనిచేస్తున్న 2.5 లక్షలమంది వాలంటీర్లు ఇంత గోలచేస్తున్నా పవన్ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గటంలేదు. తగ్గకపోగా ఆడవాళ్ళ కోసం వాలంటీర్లు రెక్కీ నిర్వహిస్తున్నారనే అతిపెద్ద పదం వాడేశారు. మామూలుగా రెక్కీ అనే పదాన్ని ఎవరినైనా హత్యచేయటానికి ముందు ప్లాన్ చేయటాంన్ని రెక్కీ అంటారు. అలాంటిది వాలంటీర్లు ఆడవాళ్ళ కోసం రెక్కీ చేస్తున్నారని ఆరోపించటం చాలా దారుణం. ఇంతవరకు ఏ కుటంబం కూడా తమింట్లో ఆడవాళ్ళు వాలంటీర్ కారణం గానే మిస్సయ్యారని ఫిర్యాదు చేయలేదు.

అయినా పవన్ వాలంటీర్ల పై అంతలేసి ఆరోపణలు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ చేసిన ఆరోపణల కు ఆధారాల ను చూపమంటే మాత్రం మట్లాడటంలేదు. ఆరోపణల కు ఆధారాలు చూపకుండా మళ్ళీ అవే ఆరోపణల ను పవన్ పదేపదే ఎందుకు  చేస్తున్నారో అర్ధంకావటంలేదు.

హ్యూమన్ ట్రాఫికింగ్ అని పవన్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న విషయమైనా తెలుసు తెలీదో. మొత్తానికి ఏదో హిడెన్ అజెండా తోనే వాలంటీర్ల పై పవన్ పదేపదే ఆరోపణల తో విరుచుకుపడుతున్నారన్నది అర్ధమవుతోంది. మరి దీని పర్యవసానాలు ఎలాగుంటాయన్నదే ఆసక్తిగా మారింది.

Similar News