మొత్తానికి పవన్ కళ్యాణ్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. జనాలంతా పెద్ద ఓట్ల మార్పిడి మీద దృష్టిపెట్టిన టైంలో అనంతపురం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాడు పవన్. గతంతో పోలిస్తే పవన్ ప్రసంగం మీద జనాలంతా పాజిటివ్ గా స్పందిస్తున్నారు ఈసారి. పద్ధతిగా.. స్థిమితంగా మాట్లాడి ఆకట్టుకున్నాడు జనసేన అధినేత. అంతే కాక తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శల దాడి కూడా కొంచెం పెంచాడు. ఈ ప్రభుత్వం అవినీతి గురించి ప్రస్తావించాడు. అన్నిటికంటే ఆసక్తి రేకెత్తించిన విషయం.. అనంతపురంలోనే తన తొలి జిల్లా కార్యాలయం తెరుస్తానని చెప్పడం.. ఇక్కడి నుంచే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననడం.
అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. వైఎస్ ప్రభంజనం సాగిన టైంలో మినహాయిస్తే గత నాలుగు దశాబ్దాల్లో ఎక్కువగా తెలుగుదేశం హవానే నడుస్తోంది ఇక్కడ. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఎన్నికల్లో పోటీకి ఈ జిల్లానే ఎంచుకున్నారు. హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచారు. పవన్ కూడా ఈ జిల్లా నుంచే పోటీ పడతానని చెప్పడంతో పవన్-బాలయ్య మధ్య రసవత్తర రాజకీయ వైరానికి తెరలేచినట్లే.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పవన్ ఒంటరిగానే పోటీ చేసేలా ఉన్నాడు. తెలుగుదేశం మీద నెమ్మదిగా విమర్శల దాడి పెంచి.. ఎన్నికల ముందు శత్రువుగా మారుతాడేమో అన్న అంచనాలున్నాయి. ఒకవేళ లోపాయకారీ ఒప్పందంతో పోటీకి దిగినా దిగొచ్చు. ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో కానీ.. రాబోయే రోజుల్లో మాత్రం పవన్.. తెలుగుదేశం మీద విమర్శల దాడి పెంచేలా కనిపిస్తున్నాడు. పవన్ అన్నట్లు అనంతపురంలో పార్టీ ఆఫీస్ తెరిచి ఇక్కడి నుంచి పోటీ దిగితే మాత్రం బాలయ్యతో గొడవ షురూ అవుతుంది. తన ఆధిపత్యం సాగుతున్న జిల్లాలో పవన్ అడుగుపెట్టి తెలుగుదేశం మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెడితే అప్పుడు బాలయ్య ఎలా స్పందిస్తాడు.. పవన్ ను ఎలా ఎదుర్కొంటాడు అన్నది ఆసక్తికరం. కాబట్టి రాబోయే రోజుల్లో రసవత్తర పరిణామాలు చూడబోతున్నామన్నమాటే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/