మాట.. మాటకు సంబంధం లేనట్టుగా మాట్లాడటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తర్వాతే ఎవరైనా. తాను మాట్లాడే ప్రతి మాటకు గుండెలోనూ.. మనసులోనూ ఎంతో అంతర్మధనం జరుగుతుందని.. ఆ తర్వాత మాత్రమే తన నోటి నుంచి మాట వస్తుందని చెప్పేవారు. అయితే.. ఇవన్నీ ఉత్త మాటలేనన్న విషయం తాజాగా పవన్ చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
సీఎం పదవిని చేపట్టాలంటే అనుభవం అవసరమని అప్పట్లో చెప్పిన పవన్ ఆ తర్వాతి కాలంలో.. తనకు సీఎం పదవి పెద్ద విషయం కాదని ఒకసారి.. సీఎం పదవి చేపట్టాలన్న ఆశ లేదని మరోసారి.. సీఎం పదవిని ప్రజలు ఇస్తే బాధ్యతా వ్యవహరిస్తా.. ఇలా ఒకదానికి మరొకటి సంబంధం లేనట్లుగా మాట్లాడటం పవన్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. తాజాగా ఆయన తన మనసులోని మాట చెప్పేశారు.
శషబిషలు పక్కన పెట్టేసి.. ఎవరేం అనుకుంటేనేం.. మనసులోని మాటను వెళ్లగక్కేస్తే పోలా? అన్న చందంగా పవన్ మాట్లాడినట్లు ఉంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తనను ముఖ్యమంత్రిని చేయాలని.. బాధ్యతగా పని చేస్తానని.. లేదంటే చొక్కా పట్టుకొని నిలదీయాలని వ్యాఖ్యానించారు. 2014 సార్వత్రిక ఎన్నికల వేళ.. ఇదే రీతిలో కూటమి గురించి గొప్పలు చెప్పిన పవన్.. ఆ తర్వాత ఏమైనా చేశారా? అన్న ప్రశ్న వేసుకుంటే ఆయన ఇచ్చే కమిట్ మెంట్స్ ఏ రీతిలో ఉంటాయో ఇట్టే అర్థమవుతాయి.
ఆ మధ్యలో సీఎం పదవికి అనుభవం కావాలని.. అదేమీ ఆషామాషీ కాదని చెప్పిన పవన్.. తాజాగా మాత్రం చిన్న పిల్లాడు ముచ్చట పడి చాక్లెట్ కావాలని ఎలా అయితే అడుగుతాడో.. పవన్ అదే రీతిలో సీఎం పదవిని అడిగారని చెప్పక తప్పదు. పట్టుమని పది రోజులు వరుసగా రోడ్ల మీద కనిపించని పవన్ కు.. సీఎం పదవిని కోరుకోవటం చూస్తే.. రానున్న రోజుల్లో పవన్ మనసులో దాచి పెట్టిన కోర్కెలు మరెన్ని బయటకు రావటం ఖాయమేమో?