2019లో ప‌వ‌న్ దే అధికారం అంటున్న సోద‌రుడు

Update: 2017-02-26 10:33 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రాజ‌కీయ ల‌క్ష్యం అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌డం కాద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆయ‌న సోద‌రుడైన నాగ‌బాబు మాత్రం 2019లో ప‌వ‌న్ అధికారంలోకి వ‌స్తార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నాగ‌బాబు మాట్లాడుతూ ప‌వ‌న్ లాంటి నిజాయితీప‌రుడు, డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డ‌ని వ్య‌క్తి ప‌రిపాల‌న ప‌గ్గాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కాగా, 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఒక ఓట‌రుగా తాను మంచి వ్య‌క్తి-నిజాయితీప‌రుడు ప‌రిపాల‌న ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని ఆశిస్తాన‌ని అలాంటి ల‌క్ష‌ణాలు ప‌వ‌న్‌లో ఉన్నాయ‌ని నాగ‌బాబు విశ్లేషించారు. "ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్న‌డూ ఇత‌రుల ద‌గ్గ‌రి నుంచి డ‌బ్బులు తీసుకోలేదు. పైగా అనేక సంద‌ర్భాల్లో ఆయ‌నే కోల్పోయాడు కూడా. ఒక రాజ‌కీయ పార్టీని న‌డ‌పాలంటే ఎంతో డ‌బ్బు కావాలి. అందుకోస‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టిస్తున్నాడు" అని నాగేంద్ర బాబు స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా అనూహ్య రీతిలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై నాగబాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. "అమ‌రావ‌తిని నిర్మిస్తున్నాం అనే మాట త‌ప్ప ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఏమైనా అభివృద్ధి జ‌రిగిందా? ఏదైనా జ‌రుగుతోందా? ఒక‌వేళ అలాంటిది ఏమైనా ఉంటే దయ‌చేసి మాకు తెలియ‌జేయండి. అభివృద్ధి జాడ‌లేదు. కానీ అవినీతి తారాస్థాయికి చేరింది. అధికార దుర్వినియోగం విచ్చ‌ల‌విడిగా సాగుతోంది" అంటూ నాగ‌బాబు తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేశారు.

కాగా, టీడీపీ సర్కారుపై నాగ‌బాబు చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌కం రేకెత్తిస్తున్నాయి. ఈ కామెంట్ల‌పై ఇప్ప‌టివ‌ర‌కు తెలుగుదేశం నేత‌లు ఈ వ్యాఖ్య‌ల‌పై అధికారికంగా ఏమీ  స్పందించ‌లేదు. అదే స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఎలాంటి విమర్శ‌లు చేయ‌క‌పోగా కేంద్ర ప్ర‌భుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీపై మాత్రం విరుచుకుప‌డ్డ సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News