అడపాదడపా జనంలోకి వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనంలోకి రానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన త్వరలో యాత్ర చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయని... యాత్ర ఎప్పటి నుంచి ప్రారంబించాలన్నది నిర్ణయమైపోయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి పవన్ తన యాత్ర మొదలుపెడతారని చెబుతున్నారు. చాలాయాత్రలు ప్రారంభమైనట్లే పవన్ యాత్ర కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలువుతుందని తెలుస్తోంది. వ్యవసాయం - పారిశ్రామిక రంగాల్లో వెనుకబాటు... మౌలిక వసతులు లేమి... కాలుష్యం - మూత్రపిండాల వ్యాధుల కోరల్లో చిక్కుకుంటున్న ఉద్దానం ప్రాంతం.. తదితర అంశాలను తీసుకుని ఆయన శ్రీకాకుళం నుంచి యాత్ర షురూ చేస్తారని చెబుతున్నారు.
అయితే.... పవన్ యాత్ర వెనుక బీజేపీ ఉందని... ఆయన పర్యటన అజెండా అంతా బీజేపికి అనుకూలంగా ఉంటుందని... టీడీపిన నేరుగా విమర్శించకపోయినా ఇబ్బందిపెడతారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాలని పవన్ ను ప్రధాని మోడీ కోరిన నేపథ్యంలో బీజేపీ బ్యాకప్ తో పవన్ చేపట్టనున్న ఈ యాత్ర చర్చనీయాంశమవుతోంది.
కాగా.... పవన్ యాత్రకు సంబంధించిన వ్యవహారాల్లో రాష్ట్రానికే చెందిన బీజేపీ కీలక నేత రాంమాధవ్ నుంచి పలు సూచనలు అందినట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే బీజేపీ జాతీయ నాయకత్వం కనుసన్నల్లోనే ఈ యాత్ర సాగుతుందనడంలో అనుమానమే లేదు.