పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా స్పీడు పెంచినట్లుగా కనిపిస్తోంది. మొన్న మీడియా ముందుకొచ్చినప్పటి నుంచి ఆయన ఏమాత్రం వెనక్కుతగ్గడం లేదు... ఆ రోజు పెద్దగాప్రభావం చూపలేదు అనిపించినా తాజాగా మాత్రం ఆయన కాస్త దూకుడుగానే వెళ్తున్నారు. రాజకీయ వైఖరులన్నీ వంటబట్టించుకున్నట్లుగానూ కనిపిస్తున్నారు.. ఎటచ్చీ ఆయన ఎంచుకున్న మాధ్యమమే ఇండియన్ పాలిటిక్స్‌కు ఇంకా పూర్తిస్థాయిలో సూటయింది కాదు... ఆయన రాజకీయంగా మంచి కామెంట్లే చేస్తున్నా దానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకోవడం వెంటనే ప్రజలకు చేరడం లేదు. మొన్న తెలుగు ఎంపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ దాన్నుంచి ఏమాత్రం వెనక్కుతగ్గలేదు. తాజాగా ఆయన మరోసారి కౌంటర్ ఇచ్చారు.
ఏపీ పునర్విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేవపెట్టినప్పుడు ఏపీ ఎంపీలంతా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. 2015 మార్చి 17న ఏపీ పునర్విభజన బిల్లు పెట్టినప్పుడు ఎంతమంది సీమాంధ్ర ఎంపీలు అటెండయ్యారని ఆయన ప్రశ్నించారు. తన అభిమానులు, ప్రజలు ఈ విషయం పరిశీలించాలని కోరుతూ... తాను వారిని ప్రశ్నించడంలో ఎలాంటి తప్పులేదని చాటుకునే ప్రయత్నం చేశారు. విభజన బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు సీమాంధ్ర ఎంపీలు కేవలం అయిదుగురు మాత్రమే హాజరయ్యారని... మిగతావారంతా ఏం చేశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను చెప్పిన లెక్కలకు సంబంధించిన ఆధారాలు కూడా ఆయన బయటపెట్టారు. అంతేకాదు... తనపై విరుచుకుపడుతున్న కేశినేని నానిని ఇరుకునపెట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన పలు ఆధారాలు వెల్లడించారు. పార్లమెంటుకు నాని ఎన్నిసార్లు హాజరయ్యారు... ఏఏ చర్చల్లో పాల్గన్నారు... ఏం మాట్లాడారు.. ఏం ప్రశ్నలు వేశారు వంటివన్నీ పవన్ వెల్లడించారు. మొత్తానికి పవన్ తీరు చూస్తుంటే కొంత స్పీడుగానే కనిపిస్తోంది. గతంలో మాదిరిగా విషయాన్ని అంతటితో వదిలేయకుండా ఫాలోఅప్ చేయడం... ఆధారాలు సేకరించి వెల్లడించడం వంటివన్నీ పవన్ రాజకీయాల్లో వేగం పెంచుతున్నారనడానికి నిదర్శనాలే.