రోడ్ల మ‌రమ్మ‌తుల‌పై ప‌వ‌న్ వేసిన ప‌వ‌ర్‌ఫుల్‌ సెటైర్ ఇదే!

Update: 2022-09-17 13:02 GMT
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల డోసు పెంచారు. మాట‌ల కంటే చేత‌ల ద్వారానే వైఎస్సార్సీపీ నేత‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్లు ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీలాగా త‌న‌కు ప‌త్రిక‌లు, టీవీ చానెళ్ల మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాపైనే ప‌వ‌న్ ఆధార‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాను స‌మ‌ర్థంగా వినియోగించుకుంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కార్టూన్ల రూపంలో నిప్పులు చెరుగుతున్నారు.

ఇప్ప‌టివర‌కు మ‌ద్య‌పాన నిషేధం, రోడ్ల స‌మ‌స్య‌లు, వ‌ర‌ద‌లపై వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరును త‌ప్పుబ‌డుతూ సోష‌ల్ మీడియాలో సెటైరిక‌ల్ కార్టూన్లు పోస్టు చేసి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

ఇప్పుడు ఒక ఊరిలో వినాయ‌కుడి ల‌డ్డూను వేలం వేయ‌గా వ‌చ్చిన సొమ్ముతో గ్రామ‌స్తులు త‌మ ఊరి రోడ్డును నిర్మించుకున్న వ్య‌వ‌హారాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం దృష్టికి తెస్తూ ప‌వ‌న్ దుమ్ములేపే కార్టూన్‌తో విరుచుకుప‌డ్డారు.

ఏలూరు జిల్లా క‌లిదిండి మండ‌లం తాడినాడ నుంచి చిన‌తాడినాడ వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారి పూర్తిగా దెబ్బ‌తింది. 5 కి.మీ ఉన్న ఈ మార్గాన్ని అధికారులెవ‌రూ ప‌ట్టించుకోలేదు. ప‌లుమార్లు ప్ర‌జాప్ర‌తినిధుల దృష్టికి తీసుకెళ్లినా చూద్దాం.. చేద్దామ‌న్న‌వారే త‌ప్ప రోడ్డు వేసిన‌వారు లేరు. దీంతో గ్రామ‌స్తులు త‌మ ఊరిలో వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా వినాయ‌క విగ్ర‌హాన్ని పెట్టారు. ఇటీవల ఉత్స‌వాల చివ‌రి రోజు ల‌డ్డూ పాట‌కు వేలం నిర్వ‌హించారు. ల‌డ్డూ వేలం రూ.250 ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయింది. ఈ మొత్తానికి తోడు గ్రామ‌స్తులు మ‌రో ల‌క్ష రూపాయ‌లు విరాళం వేసుకుని.. మొత్తం రూ.3.50 ల‌క్ష‌ల రోడ్డు నిర్మించారు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సోష‌ల్ మీడియాలో ఒక సెటైరిక‌ల్ కార్టూన్ ను పోస్టు చేశారు. కార్టూన్ ప్ర‌కారం.. "ఇక నుంచి గ‌ణేశ్ ఉత్స‌వాల‌కు అనుమ‌తి కావాలంటే ల‌డ్డూ ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని నిబంధ‌న పెడ్దాం సార్.. వేలం డ‌బ్బుతో రోడ్డు వేసి ప్ర‌తిప‌క్షాల నోరు మూయిద్దాం"  అంటూ ఒక వ్య‌క్తి సీఎం జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇస్తూ ఉంటాడు.

కార్టూన్ కింద.. "గ‌ణ‌ప‌తి ల‌డ్డూ వేలం డ‌బ్బుతో రోడ్డు మ‌రమ్మ‌తు చేయించుకున్న గ్రామ‌స్తులు"  అని విష‌యాన్ని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ  సెటైరిక‌ల్ కార్టూన్‌ని పవన్ కల్యాణ్‌ పోస్ట్ చేశారు. దీంతో ఈ కార్టూన్ క్ష‌ణాల్లోనే వైర‌ల్ గా మారింది. ప‌వ‌న్ అభిమానులు, నెటిజ‌న్లు, జ‌న‌సేన పార్టీ శ్రేణులు దీన్ని లైకులు, కామెంట్లు, షేర్ల‌తో హోరెత్తిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News