'మత్తు' చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు ఇప్పటికీ పేలుతున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఏపీని 'మత్తు' అగ్నిగుండంగా మార్చింది. ఇప్పటికీ రాష్ట్రంలో సాధారణ పరిస్థితి రాలేదు. డ్రగ్స్ వ్యవహారం రెండు నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైంది. చాలా ఆలస్యంగా తేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. డ్రగ్స్ పై విమర్శలు మొదలుపెట్టారు.
డ్రగ్స్‌పై ప్రభుత్వాన్ని ఇరికించామని టీడీపీ అనుకుంటుంటే.. మరోవైపు ధీటుగా కౌంటరిచ్చామని వైసీపీ నేతలు ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ఇలా టీడీపీ, వైసీపీ వాదులాడుకుంటున్న సమయంలో పవన్ ఎంట్రీ ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఘర్షణలు జరిగిన తర్వాత పవన్ స్పందించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ గంజాయి వ్యవహారంపై మాట్లాడడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్ స్వతహాగానే స్పందిస్తున్నారా? లేక టీడీపీకి ఎక్కడ మైలేజీ వచ్చేస్తుందేమో అని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? అనే అనుమానాలు బయలుదేరాయి.
గత కొన్ని రోజులుగా గంజాయి, హెరాయిన్, డ్రగ్స్‌పై రాష్ట్రంలో తీవ్రమైన చర్చ జరుగుతున్నా పవన్ మౌనంగా ఉన్నారు. ఏమైందో ఏమో గానీ సడన్ ఇప్పుడు గంజాయిపై సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు పట్టుకున్న గంజాయి, దాని వివరాలు తెలుపుతున్న అధికారుల వీడియో క్లిప్పింగ్ లను జత చేసి వరసగా ట్విట్టర్‌లో పొస్టులు చేస్తున్నారు. 2018లో తాను ఏవోబీలో గిరిజన తండాలలో పోరాట యాత్ర చేసిన సందర్భంలో గంజాయి సాగు, రవాణా అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్ అంశాన్ని సామాజిక-ఆర్థిక సమస్యగా చూడాలని వ్యాఖ్యానించారు. ఈ సమస్య అకస్మాత్తుగా తలెత్తలేదని, 15-20 ఏళ్లుగా ఉందని చెప్పారు. గంజాయి సాగు గతంలో కూడా ఉందని, ఇప్పుడు మరింత పెరిగిందని, 2018లో తాను గంజాయి గురించి మాట్లాడిన వీడియోను పవన్ పోస్ట్ చేశారు. పవన్ ఏక కాలంలో వైసీపీ, టీడీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారనే చర్చ జరుగుతోంది.
పవన్ ట్వీట్ల పై వైసీపీ, టీడీపీలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే 2018లోని అంశాన్ని పవన్ ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారని టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు, రవాణపై అప్పటి మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది టీడీపీని ఇబ్బంది పెట్టే విధంగా ఉందని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.
ఇప్పుడు పవన్ పాత విషయాలను ప్రస్తావించడంతో పవన్‌కు ఏమైందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ ట్వీట్‌పై వైసీపీ నేతలు మరోలా స్పందిస్తున్నారు. 2018 అంశాన్ని పవన్ మామూలుగా ప్రస్తావించారే తప్ప.. ఆయన అసలు ఉద్దేశం అది కాదని విమర్శిస్తున్నారు. నాటి మంత్రులు అయ్యన్న, గంటా చేసిన వ్యాఖ్యలపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు. పైకి పవన్, జనసేన నేతగా కనిపిస్తున్నా.... ఆయన టీడీపీ మనిషేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.