వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ వారుసులు?

Update: 2017-06-17 09:04 GMT
అనంతపురం రాజ‌కీయాల్లో జేసీ బ్ర‌ద‌ర్స్‌ కు త‌మ‌దైన గుర్తింపు ఉంది. వారిద్ద‌రూ త‌మ వ్యాఖ్య‌ల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటారు. వారిద్ద‌రూ త్వ‌ర‌లో రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోనున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను బ‌రిలోకి దించాల‌ని జేసీ బ్ర‌ద‌ర్స్ భావిస్తున్నార‌ని స‌మాచారం. అందులో భాగంగానే  జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడు ప‌వ‌న్ అనంతపురంలోని ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నార‌ని వినికిడి.
 
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అనే విష‌యం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశమైంది. మారింది. త‌న రాజ‌కీయ బ‌రువుబాధ్యతలను కుమారుడు పవన్‌ కు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. దివాకర్‌ రెడ్డి కుటుంబం ఇప్ప‌టివ‌ర‌కు తాడిపత్రి రాజకీయాలకే పరిమితం అయ్యింది. టీడీపీలో ఎంపీగా దివాకర్‌ రెడ్డి సేవలు ఏడు నియోజకవర్గాలకు విస్తరించాయి.

పవన్‌ కూడా అప్పుడప్పుడు అనంతపురంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్ర‌స్తుతం వివిధ వర్గాల వారిని కలిసి విందులను ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్‌ విందులు కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు.
 
అంతే కాకుండా, వివిధ పార్టీల రాజకీయ నేతలను కలుస్తున్నారు. అయితే,  పవన్‌ లోక్‌ సభకు పోటీ చేస్తారా? లేదా? అన్న విష‌యంపై స్పష్టత రాలేదట‌. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అనంతపురం రూరల్‌ స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. రూరల్ ప్రాంతంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండ‌డ‌మే ఇందుకు కారణం.

తాడిపత్రి ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా త‌న అన్న బాట‌లోనే ప‌య‌నిస్తున్నారు. తన స్థానాన్ని కుమారుడు అస్మిత్ రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.  అస్మిత్ ఇప్పటికే తాడిపత్రిలో మునిసిపల్‌ వార్డు కౌన్సిలర్‌ గా రాజకీయ ప్రవేశం చేసేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News