ఒక పార్టీ అధినేత.. అంటే ఎలా ఉండాలి. 13 ఉమ్మడి జిల్లాలు.. భిన్నమైన ఆహార్యాలు.. అంతకు భిన్న మైన రాజకీయ ఆలోచనల తో ఉన్న ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎలా వ్యవహరించాలి? అంటే.. ఏ సాధారణ వ్యక్తిని అడిగినా.. ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలనే చెబుతారు. ఎందుకంటే.. రాష్ట్రంలో రాజకీయం అలా ఉంది. ఇక్కడ వ్యక్తులు కాకుండా. ఇప్పుడు వ్యవస్థకు.. ప్రజల ఆలోచనల కు మధ్య బంధం ఏర్పడింది. రాష్ట్రం విభజన కారణంగా నష్టపోయిందని.. ప్రజలు భావిస్తున్నారు.
ఏ ఇద్దరు కలుసుకున్నా.. రాజధాని గురించి, అప్పుల గురించి, కేంద్రం నుంచి అందని సాయం గురించి.. అదేసమయంలో తమ ప్రాంతం అభివృద్ధి గురించి కూడా ఎక్కువగాచర్చిస్తున్నారు. ఇక్కడ వారికి కావా ల్సింది.. నాయకులు కాదు.. తమకు, రాష్ట్రానికి మేలు చేసే నాయకులు. ఇదే దిశగా ప్రజలు కొన్నాళ్లుగా ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా చిన్న విషయం. ఎందుకంటే.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల ను గమనిస్తే.. వెంటనే ఇది అర్థం అవుతుంది.
ఇక కులాలు మతాల మధ్య మన రాష్ట్రం లో ఘర్సణలు లేకపోయినా.. అభివృద్ధి, రిజర్వేషన్‌ల అంశం మాత్రం చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో తమకు దన్నుగా నిలిచేవారికి మద్దతు ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారు. దీనిని ఎవరు గమనిస్తున్నారో.. లేదో తెలియదు కానీ.. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం గ్రహించారు. కానీ, ఆయన తను చేస్తున్న వారాహి యాత్రల్లో మాత్రం ఎక్కడా ఆయా విషయాల ను ఆయన పేర్కొనడం లేదు.
పైగా.. పొంతలేని వ్యాఖ్యలు చేస్తూ.. పరిణామాల ను తనకు తానే.. కఠినం చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. "రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రజల కు చేరువ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ, ఇంకాటైం పట్టేట్టు ఉంది" అని జనసేన లోనే ఓ వర్గం నాయకులు అబిప్రాయపడు తుండడం గమనార్హం. దీనికి కారణం.. గంటకో మాట.. పూటకో.. విధానాన్ని పవన్ ప్రకటిస్తుండడమేనని అంటున్నారు. అందుకే.. ముందుగా ఆయన తన తీరు ను మార్చుకోవాలని అభిమానులుకూడా సూచిస్తున్నారు.