జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ముగిసింది. గత కొన్నాళ్లుగా తీవ్రస్థాయిలో చేసిన హడావుడి సర్దు మణిగింది. విశ్వవ్యాప్త యువ జనానికి దిశానిర్దేశకుడుగా భావించే వివేకానంద స్వామి జయంతిని పురస్క రించుకుని శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా.. యువశక్తిని చాటి చెప్పేందుకు.. యువ గళాన్ని వినిపిం చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం.. నిజంగానే నభూతో.. అని చెప్పక తప్పదు.
పేరులోనే 'యువశక్తి' అని ప్రకటించిన దరిమిలా.. పవన్ వ్యూహం ముందుగానే అందరికీ ఒక అవగాహన కు వచ్చింది. కేవలం యువతకు.. వారి సమస్యలకు.. వారి రాజకీయాలకు.. వారి భవితకు.. వారి విద్యకు మాత్రమే పరిమితం అవుతారని.. మేధావులు లెక్కులు వేసుకున్నారు. నిజమే.. ఎందుకంటే.. పేరును బట్టి.. సభపై ఒక అంచనాకు రావడం అనేది సహజమే కదా..!!
ఇక, సభ అయిపోయింది. అందరూ వెళ్లిపోయారు.. మైకులు ఆగిపోయాయి. కానీ, కొన్ని ప్రశ్నలు మాత్రం సభా ప్రాంగణంలో మిగిలిపోయాయి. ఆశ్చర్యంగా ఉందా? కవితాత్మకం అనుకుంటున్నారా? కానేకాదు.. పచ్చి నిజం! పవన్ సభలు అంటే.. గతంలో ఒక సబ్జెక్టు ఉండేది. దానికి పరిమితం కూడా అయ్యేది. కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఒకే ఒక కాన్సెప్టు పెట్టుకున్నాక.. ఈ సభలకు ఆయువుపట్టు ఆవిరి అవుతోందనే వాదన వినిపిస్తోంది.
+ యువశక్తి వేదికగా.. పవన్ ఏం చేశారు? అనేది ప్రధాన ప్రశ్న? సాధారణ సభల్లో మాదిరిగానే వైసీపీని తిట్టిపోశారు. ఇంకా చెప్పాలంటే.. మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. కొత్తగా మూడు ముక్కలనే పేరుతో సీఎంను తిట్టిపోశారు. ఓకే.. ! దీనికి యువశక్తి అనే పేరు అవసరమా? అనేది సామాన్యుడి ప్రశ్న.
+ కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయాలని అనుకుంటే.. రాజకీయ సభ అని పెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
+ యువతకు ఇన్ని అవకాశాలుకల్పిస్తాను .. అని ఇతమిత్థంగా ఏమీ చెప్పలేక పోయారు. యువతలో భరోసా నింపలేక పోయారు.
+ తాను అధికారంలోకి వస్తే.. ఇన్ని పరిశ్రమలు తెచ్చి.. ఇన్ని ఉద్యోగాలు ఇస్తాననని కానీ, విద్యకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తానని కానీ చెప్పలేక పోయారు.
+ రాజకీయంగా కీలకమైన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల నుంచి తన పార్టీ తరఫున యువతకు ఇచ్చే సీట్ల విషయంపైనా పవన్ పెదవి విప్పలేక పోయారు.
+ ఒక్కమాటలో చెప్పాలంటే.. సూత్రంలేని గాలి పటం మాదిరిగా.. యువశక్తి సభ సాగిపోయింది!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.