జనసేనను రాజకీయ పార్టీగా ముందుకు తీసుకువెళ్లి.. ప్రజల మద్దతు కోరాలని.. వారి సమస్యలు పంచుకో వాలని.. వారితోనే మమేకం కావాలని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు . ఈ క్రమంలోనే ఆయన ప్రజల మధ్య ఉండకపోయినా.. కోవర్టులుగా పనిచేసినా.. వారి పని పడతానంటూ .. హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయితే.. పవన్ చేసిన ఈ హెచ్చరికలు ఏమేరకు పనిచేస్తాయనేది ఇప్పుడు చర్చకు దారితీస్తున్న అంశం.
ఎందుకంటే.. పార్టీని సరైన పునాదులు లేవనేది వాస్తవం. వ్యక్తిగా పవన్ వచ్చినప్పుడు మాత్రమే.. పార్టీ గురించిన చర్చ జరుగుతోంది. పార్టీకి సంబంధించిన జోష్ కనిపిస్తోంది. ఆయన కనుక హైదరాబాద్ వెళ్లిపోతే.. ఉలుకు పలుకు కూడా ఉండడం లేదు.
పైగా పార్టీ వ్యవహారా ఇంచార్జ్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ మాటను కూడా ఎవరూ పెద్దగా ఖాతరు చేయడం లేదు. దీనికి కారణం.. టికెట్లు ఇచ్చేది.. పవన్ మాత్రమేననే ఒక అభిప్రాయం ఏర్పడడంతోపాటు.. పార్టీలో ఏకైక నాయకుడు పవన్ అనే చర్చే!
దీనివల్ల.. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు.. అంటూ..ఎవరూ లేకుండా పోయారు. పోనీ.. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన కార్యకర్తలు.. నాయకులు.. బూత్ స్థాయి కార్యకర్తలు ఉన్నారా? అంటే.. వారు కూడా కనిపించడం లేదు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నరాష్ట్రంలో పార్టీని పుంజుకునేలా చేయాలంటే.. ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలో తనకు సారూప్యంగా ఉండే మరోనేత ఉన్నారనే సంకేతాలను పంపించాలి.
లేదా.. పనిచేస్తేనే టికెట్లు ఇస్తామనే సంకేతాలు అయినా.. ఇవ్వాలి. ఇక, ప్రజలతో ఉండాలి అంటే.. ప్రజలకు సంబంధించినసమస్యలు.. వారికి ఇచ్చే హామీలపైనా నాయకులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమస్యలు వింటానికి వచ్చాం.. అంటే..
చెప్పేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. పరిష్కార మార్గాలను కూడా నాయకులు వారికి చెప్పాల్సిన రాజకీయం నెలకొంది. ఎలా చూసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఒక దశ దిశ ఏర్పడాలంటే..దానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.