ప్రజల తరఫున ఏదైనా విషయం మీద మాట్లాడాలంటే అందుకు భారీ కసరత్తు అవసరం. అంతేకానీ.. మనసుకు తోచినట్లో.. ఇంకెవరినో గుడ్డిగా ఫాలో అయితే ఎదురుదెబ్బలు తప్పవు. ఏపీ అధికారపక్షం సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవటం.. దీనిపై ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైతే.. రాజకీయ వర్గాల నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమైంది.
జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. అయితే.. ప్రజల నుంచి.. అధికారపక్షం నుంచి ఈ ఎపిసోడ్ లో ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే.. అడ్డ బ్యాటింగ్ చేసినట్లుగా పస లేని వాదనలు వినిపించటం షురూ చేశారు. ఇది సరిపోదన్నట్లుగా బాబుకు తోడయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తెలుగుభాష మీద తనకున్న ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూ తరచూ ట్వీట్లు చేయటం.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టటం లాంటివి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ స్టాండ్ తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. సమస్య అంతా తాను వినిపించే వాదనకు కౌంటర్ గా వచ్చే ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఇవ్వకపోవటం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే.. తెలుగు మీద ఇప్పటి వరకూ వినిపించిన వాదనకు భిన్నంగా ఉందని చెప్పక తప్పదు. ప్రభుత్వ పాఠశాల్లలో ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించిన పవన్.. ఇంగ్లీషు మీడియాన్ని తాను వద్దటనటం లేదని తెలుగుభాషను వదలొద్దనే మాటనే తాను చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. జగన్ ప్రభుత్వాన్ని ఏదో ఒక అంశంలో టార్గెట్ చేయాలన్న చంద్రబాబు కక్కుర్తికి ఏ మాత్రం తగ్గకుండా పవన్ టీడీపీ అధినేత దారిలో నడవటమే పెద్ద తప్పుగా చెబుతున్నారు.
ఏదైనా ఇష్యూ తెర మీదకు వచ్చినప్పుడు.. తాము తీసుకునే స్టాండ్ కు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? దానికి సంబంధించి కసరత్తు ఎలా చేయాలన్న దానిపై సరైన రీతిలో వ్యూహరచన జరిగితే పవన్ కు ఇప్పుడు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేది కాదు. సినిమా షూటింగ్ లో ఎన్ని టేకులు తీసుకున్నా ఫర్లేదు. కానీ.. రాజకీయాల్లో అలా కాదు.. సింగిల్ టేక్ లో ఓకే అయిపోవాలి. అలా కాకుండా యూటర్న్ లు తీసుకుంటే ప్రజల్లో చులకన కావటం ఖాయం. పవన్ ఈ విషయాల మీద ఫోకస్ చేస్తే మంచిది. బాబు మాదిరి కామెడీ పీస్ కాకుండా ఉండగలుగుతారు.