షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ జనసేన అధినేతలో అయమోయం పెరిగిపోతున్నట్లుంది. తానేం మాట్లాడుతున్నారో తనకే అర్ధం కావటంలేదు. ఒకరోజు మాట్లాడిన మాటలకు మరుసటిరోజు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే రెండుసార్లు కూడా తాను ఏమి మాట్లాడుతున్నాననే కనీసపు ఆలోచన, మాటపై అదుపు లేకుండా మాట్లాడుతున్నారని అర్ధమైపోతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగిన సభలో మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం.
ఇంతకీ విషయం ఏమిటంటే సభలో పవన్ మాట్లాడుతు తెలంగాణా ప్రజలకు ఇది నా తెలంగాణ అనే భావన ఉందన్నారు. ఆంధ్రా ప్రజలకు మాత్రం ఇది నా ఆంధ్ర అన్న భావన లేదని మండిపడ్డారు. నా కులం అంటు ఏపీని వెనక్కు తోసేసుకుంటున్నామన్నారు. అవకాశవాద వైసీపీ లాంటి పార్టీలకు జనాలు పట్టం కడుతున్నట్లు బాధపడిపోయారు. అన్నీ కులాలు కలిస్తే తప్ప జనసేన వేదిక లేదట. అందుకనే ఎవరి కులాన్ని వారు గౌరవించుకుంటునే కులం, మతాన్ని దాటి ఆలోచించకపోతే భవిష్యత్తును పాడు చేసుకున్న వాళ్ళమవుతామన్నారు.
ఇక్కడే పవన్ మాటల్లో ఏదో తేడా కనబడుతోంది. ఎందుకంటే రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ మనలో కుల భావన తగ్గిపోతోందని చెప్పారు. మన కులం వాళ్ళతో మన కులం వాళ్ళనే తిట్టించే సంస్కృతి పెరిగిపోతోందన్నారు. ఈ విషయాన్ని గమనించకుండానే కులాల్లో నేతలు కొట్టుకుంటున్నట్లు మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రులు కళ్ళు తెరిచి ఎవరి కులం వాళ్ళకు ఆయా మంత్రులు పనులు చేసుకోవాలన్నట్లు సలహా కూడా పడేశారు.
మూడు రోజుల క్రితమేమో జనాల్లో కులభవాన చచ్చిపోతోందని, కుల భావన లేకపోవటం బాధగా ఉందన్నారు. ఇపుడేమో కులం, మతాన్ని దాటి ఆలోచించాలంటున్నారు. పవన్ మాట్లాడిన రెండింటిలో ఏది కరెక్టు ? ఇలాంటి పరస్పర వైరుధ్యమైన ప్రకటనలను పవన్ ఇప్పటికి కొన్ని వందలు చేసుంటారు. ఓట్లేసే విషయంలో జనాలకు క్లారిటితోనే ఉన్నారు. పవన్లోనే ఎక్కడిలేని అయోమయం కనబడుతోంది. తనకు కులం లేదు, మతం లేదని ఒకసారంటారు. మళ్ళీ వెంటనే కాపులు కూడా జనసేనకు మద్దతుగా నిలబడటం లేదని పరోక్షంగా బాధపడిపోతారు.