పవన్ కళ్యాణ్ భీమవరంలో హల్ చల్ చేశారు. భీమవరంకి చాలా ప్రత్యేకత ఉంది. పవన్ 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన దాదాపుగా 9 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఇపుడు మళ్ళీ పవన్ భీమవరం మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.
లేటెస్ట్ టూర్ ని భీమవరంలోనే డిజైన్ చేశారు. అంతే కాదు జనవాణి పేరిట ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించే కార్యక్రమానికి కూడా పవన్ భీమవరం వేదికగా ఈసారి మొదలెట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కార్ మీద వేసిన సెటైర్లకు లెక్కే లేదు. భీమవరంలో ఈ నెల 4న ముప్పయి అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
ఆ కార్యక్రమానికి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన ఎందుకు హాజరు కాలేదు అన్న చర్చ నాటి నుంచి ఉంది. పవన్ కి ఆహ్వానం అందిందా లేదా అన్న దాని మీద కూడా అంతా మాట్లాడుకున్నారు. అయితే దానికి ఇన్నాళ్ళ తరువాత పవన్ అదే భీమవరం నుంచి జవాబు చెప్పారు. తనకు ప్రధాని సభకు ఆహ్వానం అందింది అని ఆయన చెప్పారు. అయితే తాను రాలేదని ఆయన ఒక రీజన్ చెప్పారు.
రాష్ట్రప్రభుత్వానికి చెందిన సొంత ఎంపీకే ఆహ్వానం లేదు, ఆయననే పిలవని ఈ కార్యక్రమానికి తాను వస్తే ఏమి బాగుంటుంది అని రాలేదు అని పవన్ అన్నారు. అంటే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజును కావాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసి ఆహ్వానం అందకుండా చేసిందని పవన్ ఆరోపించారు అన్న మాట.
ఇక తాను భీమవరం ప్రజలకు దగ్గరవాడినే అని ఆయన చెప్పుకున్నారు. వారికి ఎపుడూ అండగా ఉంటున్నానని, ఎప్పటికీ ఉంటానని చెప్పారు. తాను భీమవరంలో ఓడిపోగానే ఎక్కడికీ పారిపోలేదని కూడా ఆయన చెప్పడం విశేషం. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో మరో మారు భీమవరం నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ కూడా బయల్దేరింది. ఓడిన చోటనే ఈసారి ప్రజల మనసు గెలుచుకుని బంపర్ మెజారిటీతో గెలవాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు.
ఈసారి పోటీ ఆషామాషీగా ఉండకూడదని ఇప్పటి నుంచే జనాలలో పవన్ ఉంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ మాత్రం తన ఓటమిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. గెలుపు కూడా ఈసారి ఓడిన చోట నుంచే జరగాలి, అది కూడా బిగ్ సౌండ్ చేయాలని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి పవన్ భీమవరం ఆశలు, జనాల తీర్పు ఎలా ఉంటాయో. ఎలాటి ఫలితాలు వస్తాయో.