నేను ఎవరికీ భయపడేది లేదని.. జనసేన అధినేత పవన్ పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. అసలు తాను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రశ్నించేందుకని ఆయన అంటున్నారు. అందరూ కూడా దీనిని విశ్వసించారు. అయితే.. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. వైసీపీ సర్కారుకు పవన్ ఆయన బృందం భయపడుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్లుగా పవన్ కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ విషయాన్ని పక్కన పెట్టిన ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు.
ఈ క్రమంలో నే ఆయా కుటుంబాలకు రూ. లక్ష చొప్పున సాయం చేస్తున్నారు. వారి ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం.. రైతులకు ఏమీ చేయడం లేదని.. కేవలం తాడేపల్లి ప్యాలస్‌కు మాత్రమే పరిమితం అవుతోం దని వ్యాఖ్యానిస్తున్నారు అందుకే తాను రోడ్డు మీదికి వచ్చి.. రైతులకు న్యాయం చేసేందుకు తన సొంత నిధులను వెచ్చిస్తున్నా నని చెప్పారు. ఓకే.. ఇంత వరకుబాగానే ఉంది. అయితే.. గత నెల నుంచి పవన్ చేస్తున్న ఈ పర్యటనల్లో చాలా గోప్యత పాటిస్తు న్నారనే వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే.. గత పర్యటనలోనూ.. తాజాగా కడప జిల్లాలో చేసిన పవన్ పర్యటనలోనూ... చాలా విషయాల్లో గోప్యత పాటిస్తున్నా రు. గతంలో తాము సాయం చేసే కౌలు రైతుల విషయాలను ముందుగానే మీడియాకు వెల్లడించేవారు. అదేసమయంలో పవన్ ఆయా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి మరీ..వారి పక్కన కూర్చొని.. ఓదార్చేవారు. ఇది బాగానే వర్కవుట్ అయింది. అయితే.. కొన్నాళ్లుగా ఈ విధానంలో మార్పులు చేసుకున్నారు. పవన్ రంగంలోకి దిగే వరకు కూడా ఆయా వివరాలను వెల్లడించడం లేదు. కనీసం.. పేర్లు కూడా బయటకు రానివ్వడం లేదు.
అదేసమయంలో బాధితుల ఇళ్లకు వెళ్లడం కూడా మానేశారు. వారిని ఒక దగ్గరకు పిలిచి.. అక్కడే సాయం అందించి.. గుట్టు చ ప్పుడు కాకుండా..పవన్ వ్యవహరిస్తున్నారు ఇక, ఈ సందర్భంగా నిర్వహించే సభలో కేవలం ఎంత మందికి సాయం చేశారనేది ఫిగర్ రూపంలో చెప్పి.. చేతులు దులుపుకొంటున్నారు. అయితే.. ఇలా ఇంత కాన్ఫిడెన్షియల్‌గా దీనిని నిర్వహించడం వెనుక.. ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు భయపడుతున్నారా? లేక.. ముందుగానేచెబితే.. దానిలోని లోపాలను అధికార పార్టీ బయటకు తెచ్చి యాగీ చేస్తుందని భావిస్తున్నారా? అనేది ఆసక్తిగా మారింది.