విశాఖలో జనసేన కార్యకర్తల మీద అరెస్టుల పర్వం అలా కొనసాగుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో మూడు వందల మంది జనసేన కార్యకర్తలు దాడులతో పాటు అక్కడ విద్వంసానికి పాల్పడ్డారని విశాఖ పోలీసులు చెబుతున్నారు. అర్ధ రాత్రి నుంచి అరెస్టులు మొదలుపెట్టి తొలుత పది మంది దాకా ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. అయితే ఆ సంఖ్య తరువాత పాతికకు చేరుకుంది. ఇపుడు అది కాస్తా 76కి పెరిగింది అంటున్నారు.
ఇక జనసేన తరఫున అరెస్ట్ చేసిన నాయకులలో సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు విశాఖ విజయనగరంతో పాటు, గోదావరి జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరిని జిల్లా జడ్జి ముందు హాజరు పరచి విచారణ కోసం రిమాండ్ కోరుతారని అంటున్నారు. అయితే ఐపీసీ సెక్షన్ 307 అంటూ హత్యా యత్నం కేసును చాలా మంది నేతల మీద రిజిష్టర్ చేశారు. దీని మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
జనసేన కూడా లీగల్ గా ఫైట్ చేసి తమ వారికి బెయిల్ ఇప్పించుకోవడానికి చూస్తోంది. దాంతో పోలీసులు కోర్టుకు ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే వారికి బెయిల్ ఇస్తారు. ఇక కీలక నేతలను విచారించాలని రిమాండ్ కోసం పోలీసులు కోరుతారు అని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ అరెస్టుల పర్వం ఇంతటితో ఆగేలా లేదు. నంబర్ చూస్తూంటే వందకు పైగా చేరవచ్చు అంటున్నారు. దాంతో పాటు పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారన్న దాని మీద అధికారికంగా అయితే వివరాలు లేవు అంటున్నారు. ఏది ఏమైనా జనసేన నాయకుల అరెస్టు చేసినా రిమాండ్ ఎంతమందికి కోర్టు విధిస్తుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు.
పోలీసులు హడావుడిగా అరెస్టులు అయితే చేశారు. కానీ సరైన ఆధారాలు కనుక కోర్టు ముందు పెట్టకపోతే అపుడు వారే జవాబు చెప్పుకోలేక ఇబ్బంది పడతారు అంటున్నారు. మరో వైపు అయితే తమ పార్టీ వారు అంతా బయటకు వస్తారని జనసేన ధీమా వ్యక్తం చేస్తోంది. పార్టీ నాయకులను విడిపించుకుని విశాఖలో అనుకున్న విధంగా మీటింగ్ నిర్వహించి మరీ హైదరాబాద్ వెళ్తాను అని పవన్ పట్టుదల మీద ఉన్నారు. దాంతో విశాఖలో వైసీపీ సర్కార్ వర్సెస్ పవన్ అన్నట్లుగా రాజకీయ టెన్షన్ ఒక్క లెవెల్ లో సాగుతోంది.