పవన్ కళ్యాణ్ సినీ హీరోగా అరంగేట్రం చేసిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఇపుడు పవన్ రాజకీయాల్లోనూ దాదాపు అలాంటి టైటిల్ ఉండేలా చూసుకుంటున్నారా అన్నదే హాట్ టాపిక్. ఆ టైటిల్ ఏంటి అంటే అక్కడ కుమార స్వామి ఇక్కడ పవన్ కళ్యాణ్. ఈ పోలిక ఏంటి అని ఆశ్చర్యం కలిగినా కలగవచ్చు కానీ కర్ణాటక కుమారస్వామి తరహాలోనే ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయాలు కూడా 2024లో ఉంటాయా అంటే అవును అని అంటున్నారు.
కుమారస్వామి పార్టీ జేడీ ఎస్. ఆయన తండ్రి సీనియర్ మోస్ట్ నేత దేవేగౌడ. ఆయన జనతాదళ్ లో 1980 దశకంలో పనిచేశారు. నాటి సీఎం దివంగత రామకృష్ణ హెగ్డే ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఆయననే దించేసి సీఎం పీఠం ఎక్కారు. దానికి ఆయనకు ఉన్న బలమైన సామాజికవర్గమే కారణం. ఈ ముచ్చట జరిగి మూడు దశాబ్దాలు పై దాటింది. ఇక నాటి నుంచి ఆయన జేడీ ఎస్ అని ఒక పార్టీని స్థాపించి తనకు బలం ఉన్న సామాజికవర్గంలోనే కనీసంగా ముప్పయి నుంచి నలభై దాకా సీట్లు ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుచుకుంటూ వస్తున్నారు.
ఇదే ఆయనకూ ఆయన కుమారుడు కుమారస్వామికి రాజకీయ లాభాన్ని తెచ్చిపెడుతోంది. కుమార స్వామి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాకలు తీరిన నాయకులు కన్నడ సీమలో ఎందరో ఉన్నా ఎవరికీ దక్కని అదృష్టం ఇది. అలాగే కుమార స్వామి తండ్రి దేవేగౌడకే ఇన్ని సార్లు సీఎం కుర్చీ భాగ్యం లభించలేదు. ఆయన కోరుకున్న సీఎం సీటు కోసం దశాబ్దాలు చూడాల్సి వచ్చింది. అనూహ్యంగా ప్రధానమంత్రి పదవి మాత్రం వరించి వచ్చింది. అలా దేవెగౌడ కుమార స్వామీ ఇద్దరూ రాజకీయ అదృష్టవంతులు.
అయితే ఈ ఇద్దరి వెనక బలమైన సామాజికవర్గం అండదండలు ఉండడమే వరంగా చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే 2019లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో కుమార స్వామి సీఎం అయి కొన్నాళ్ళు రాజ్యం చేశారు. తాజా ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని, జరగాలని ఆ పార్టీ కోరుకుంటోంది. వస్తున్న సర్వేలు అన్నీ కూడా కన్నడ నాట హంగ్ తప్పదనే సూచిస్తున్నాయి.
కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు అన్న మాట. అనేక సర్వేలలో కాంగ్రెస్ కి 100 కు పైగా సీట్లు వస్తాయని చెబుతున్నాయి కానీ మెజారిటీ వస్తుందని ఖరారు చేయడంలేదు బీజేపీ ఓడినా డెబ్బై నుంచి ఎనభై దాకా సీట్లను రాబట్టుకుంటుందని సర్వేలు చెప్పడమే ఇందుకు కారణం. అంటే నెక్ టూ నెక్ ఫైట్ సాగుతోంది అన్న మాట.
ఇక గత ఎన్నికలలో కుమారస్వామి జేడీ ఎస్ కి 38 సీట్లు దక్కాయి. ఈసారి అయిదారు సీట్లు తగ్గినా ముప్పయి సీట్లు పై దాటే కుమార స్వామి తెచ్చుకుంటారని అంటున్నారు. అంటే కాంగ్రెస్ కి ఏ వంద దగ్గరో సీట్లు వచ్చి ఆగిపోతే ఆ లోటుని భర్తీ చేయడానికి కుమార స్వామి రెడీగా ఉంటారన్న మాట. దానికి ప్రతిఫలంగా ఆయన మళ్లీ సీఎం సీటుని కచ్చితంగా కోరుకుంటారని అంటున్నారు. అందుకే హంగ్ అసెంబ్లీ కోసమే జేడీఎస్ చూస్తోందిట.
కట్ చేస్తే ఏపీలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ రెండింటి మధ్య హోరా హోరీ పోరు సాగుతుందని ఇప్పటి దాకా వచ్చిన సర్వేలు చెబుతున్నాయి. ఏకపక్షంగా ఏ ఒక్క పార్టీకి భారీ సీట్లు లభించే సీన్ అయితే లేదు అంటున్నాయి. ఇక పొత్తులతోనే జనసేన ముందుకు వస్తుందని అంటున్నారు. ఈ రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకునే యాభీ సీట్లకు జనసేన పట్టు పడుతోంది అని అంటున్నారు.
అంటే టీడీపీ ఏ 120 సీట్లలో పోటీ చేస్తే అందులో మ్యాజిక్ ఫిగర్ 88 కి సరిపడా సీట్లు దక్కే అవకాశాలు స్వల్పంగా ఉంటాయి. దాంతో జనసేన అవసరం ప్రభుత్వ ఏర్పాటులో పడుతుంది. దాంతో పవన్ కళ్యాణ్ సీఎం గా డిమాండ్ పెట్టి మరీ ముందుకు వస్తారని అంటున్నారు. కన్నడలో కుమార స్వామికి ఇక్కడ పవన్ కి మరో పోలిక ఉంది. బలమైన సామాజికవర్గాలు ఈ రెండు పార్టీలకు అండగా ఉండడమే ఆ పోలిక.
ఇక 2019 నాటికే కుమారస్వామి ప్రయోగం ఏపీలో చేయలని పవన్ ఒంటరిగా పోటీ చేశారు కానీ నాడు జగన్ మీద ఉన్న మోజుతో తీర్పు వేరేలా జనాలు ఇచ్చారు. ఈసారి అటు బాబుని ఇటు జగన్ని జనాలు చూసేశారు కాబట్టి ఎలాంటి మోజూ ఉండని తీర్పు రానుంది. అదే జనసేనకు వరంగా మారనుంది అంటున్నారు. అందుకే జై జనసేన అని అంటున్నారు సైనికులు. పవన్ మంచి పరిపాలకుడు అవుతాడని అన్నగా దీవించేస్తున్నారు నాగబాబు కూడా.