ఏ పార్టీకైనా ఎన్నికలకు ముందు... క్లారిటీ అవసరం. ఈవిషయంలో ఏ చిన్న పొరపాటు చేసినా.. ప్రజల్లో సరైన సంకేతాలు వెళ్లడం చాలా కష్టం. ఇప్పుడు జనసేన విషయంలోనూ ఇదే జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు చేసిన ప్రచారం.. రాజకీయం ఒక ఎత్తయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. ఆయన ఇప్పుడు చేస్తున్న వారాహి యాత్రలు అత్యంత కీలకం.
ఇప్పటి వరకు జనసేనపై ఉన్న అపోహలు, సందేహాలకు తెరదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగానే వారాహి యాత్ర సాగుతుందని ఆ పార్టీ నాయకులు సహా మేధావులు సైతం అంచనా వేసుకున్నా రు. ప్రజలను మరింత ఎక్కువగా పార్టీవైపు తిప్పుతారని.. వారిలో నెలకొన్న అనుమానపు మేఘాలను పటాపంచలు చేస్తారని కూడా జనసేన నేతలు ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు.
అయితే.. అందరూ అనుకున్న విధంగా పవన్ వ్యవహరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఆయ న ఎలా వ్యవహరించారో.. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా పొత్తుల విషయంలో పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు. కొంత సేపు పొత్తులు అవసరం అని చెబుతూనే.. మరోవైపు.. ఒంటరిగానే గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తామ ని.. పిఠాపురం సభలో చెప్పుకొచ్చారు.
ఇది.. మరోసారి ప్రజలను, పార్టీ నేతలను కూడా అయోమయంలోకి నెట్టేసింది. ఇక, ఇంకో వైపు.. తాను సీఎం అవుతానని.. ప్రజలు ఆశీర్వదించాలని పిఠాపురం సభలో చెప్పుకొచ్చారు. దీనికి ముందు నిర్వహిం చిన సభలో కనీసం తనను ఎమ్మెల్యే అయినా.. చేయాలని.. తాను ఒక్కడిని గెలిచినా.. చాలని వ్యాఖ్యానిం చారు. ఇలాంటి తడబాటు వ్యాఖ్యలతో జనసేన అధినేత ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటివే ఇక ముందు కూడా కొనసాగితే.. వైసీపీకి లబ్ధి చేకూర్చడం తప్ప.. పవన్ యాత్రలతో ఫలితం లేదని పరిశీలకులు గట్టిగానే చెబుతున్నారు.