అజిత్ కోసం రంగంలోకి దిగిన పవార్ భార్య !

Update: 2019-11-26 09:18 GMT
అజిత్ పవర్ ..ఈ ఒక్క పేరు ఇప్పుడు దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి మరికొద్ది గంటలలో తెర పడబోతోంది అని అందరూ అనుకుంటున్న సమయంలో అజిత్ పవర్ తీసుకున్న ఈ నిర్ణయం ..శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ నేతలతో పాటుగా యావత్ దేశంలోని అందరిని షాక్ కి గురైయ్యేలా చేసింది. బీజేపీ వేసిన బాణానికి చిక్కిన పవర్ ..కేవలం కొన్ని గంటలలోనే శివసేన , కాంగ్రెస్ తో విభేదించి బీజేపీకి మద్దతుగా నిలిచి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతుగా నిలిచారు. అలాగే అజిత్ పవర్ కూడా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేసారు.

ఈ ఊహించని పరిణామంతో మహా రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. బీజేపీ అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అని , వారికి తగిన మద్దతు లేదు అని విపక్షాలు సుప్రీం కోర్టుని ఆశ్రయించాయి. దీనితో విచారణ చేసిన ధర్మాసనం .. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు అసెంబ్లీ లో విశ్వాస పరీక్ష నిర్వహించాలని తెలిపింది. ఇక ఈ పరిణామంతో మహారాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి, తమ ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికి విపక్ష పార్టీలైన ..శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ పక్కా వ్యూహాలని అమలు చేస్తుంది. అలాగే బీజేపీ కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలని కాపాడుకుంటూనే .. ఇతర పార్టీలోని ఎమ్మెల్యేలని లాగేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇకపొతే ..దీనికి ప్రధాన కారణమైన అజిత్ పవర్ తో  శరద్ పవర్ భార్య ప్రతిభా పవార్ భేటీ కాబోతున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల కారణంగా  పార్టీలో చీలిక రావడం ఇష్టం లేని శరద్ పవార్ . ఇప్పటికే పలుసార్లు అజిత్ పవార్‌ ని తిరిగి ఎన్సీపీలోకి రావాలంటూ చెప్పారు. అలాగే అయన వద్దకు పలువురు నేతలను రాయబారులుగా పంపారు. అయిన  అజిత్ మెట్టు దిగకపోవడంతో.. ఇక చివరి ప్రయత్నంగా తన భార్యను అజిత్‌తో మాట్లాడేందుకు పంపనున్నారని తెలుస్తోంది. అయితే , అజిత్ ఒక్కరు తప్ప , మిగిలిన ఎన్సీపీ ఎమ్మెల్యే లు అందరూ కూడా తమతోనే ఉన్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్తున్నారు. అలాగే బీజేపీకి మద్దతుగా నిలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే అజిత్ పవార్ ని కూడా తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే సుప్రీం బీజేపీ ప్రభుత్వం బుధవారం బలాన్ని నిరూపించుకోవాలని చెప్పడం తో పవార్  సీఎం ఫడ్నవిస్  ఇంటికి వెళ్లినట్టు సమాచారం. చూడాలి రేపటి తో అయిన మహారాష్ట్ర రాజకీయం ఒక కొలిక్కి వస్తుందేమో ..
Tags:    

Similar News