ఎంత పెద్ద నేరం చేసినవారైనా జైలుకు వెళ్లాలని అనుకుంటారా? పది హత్యలు చేసినవాడు కూడా బెయిల్ కోసం పరితపిస్తుంటాడు. ఎందుకంటే జైలులో పరిస్థితి అలా ఉంటుంది మరి. చుట్టుగోడ - గదిలో కూర్చోవాలి.. స్వేఛ్చకు సరైన మీనింగ్ తెలుసుకునే పరిస్థితులు.. ఈ శిక్ష ఎవరు మాత్రం కోరుకుంటారు. ఎంత పెద్ద నేరం చేసినవాడైనా.. జైలు శిక్ష అంటే కచ్చితంగా భయపడిపోతుంటారు. ఏళ్లతరబడి జైల్లో ఉండి విడుదలయిన వారిని కదిపితే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వస్తుంది. అయితే ఎప్పుడు జైలు చూడనివారు - జైలుకి వెళ్తే ఎలా ఉంటుంది.. అక్కడ జీవన శైలి ఎలా ఉంటుంది అని ఆలోచించేవారు ఎవరైనా ఉంటే.. ఇకవారి కోరిక తీరిపోయినట్లే.
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోగల సంగారెడ్డి జైలు ను మ్యూజియంగా మార్చారు అధికారులు. ఈ సందర్భంగా "ఫీల్ ది జైల్" అనే వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అసలు జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవలనుకున్నా, లేక ఒకరోజు జైలు జీవితానికి సంబందించిన రియల్ ఎక్స్ పీరియెన్స్ పొందాలనుకున్నా... అదీ గాక కాస్త పెద్ద మనసుతో ఆలోచించి "స్వేచ్ఛకున్న అర్ధం" తెలుసుకోవాలన్నా ఈ జైలులో ఒక గదిని ఒకరోజు అద్దెకు తీసుకోవచ్చు. అలా అద్దెకు తీసుకున్నవారిని ఖైదీలుగా భావించి అధికారులు వారిని 24గంటల పాటు ఆ జైలులో నిర్బంధిస్తారు. దీనికోసం రూ.500 చెల్లించి ఒక గదిని అద్దెకు తీసుకోవచ్చు.
ఈ విషయంలో ఎవరైన సిద్దపడి ఒకరోజు నిర్బంధాన్ని అనుభవించాలనుకుంటే వారికి... ఖాదీ వస్త్రాలు - చొక్కా - ట్రౌజర్ లేదా షార్ట్ - బెడ్డింగ్ - స్టీల్ గ్లాసు - స్టీలు ప్లేటు - వాషింగ్ సోప్ - టాయిలెట్ సోప్ కూడా జైలూధికారులు ఇస్తారు. ఆహారం కూడా టైం టు టైం అచ్చూ జైల్లో పెట్టినట్లే పెడతారు. దానికి కూడా ఒక లెక్క ఉంది లెండి. ఉదయం 7 - 7:30 మధ్యలో బ్రేక్ ఫాస్ట్ - 11 గంటలకు మధ్యాహ్నం భోజనం - మధ్యాహ్నం 12 - 12:30 మధ్యలో ఒకసారి టీ ఇస్తారు. అయితే టీ మాత్రమే ఇక్కడ ప్రత్యేకంగా తయారుచేసి ఇస్తారు తప్ప.. మిగతా ఆహారం అంతా కందిలోని జిల్లా జైలు నుంచే రప్పిస్తారు. ఈ ఒక్కరోజు జైలు జీవితం అనుభవించేవారు రోజంతా బోర్ కొడుతుందేమో అని ఏమాత్రం ఫీలవ్వాల్సిన పనిలేదు.. జైలులో కావాలంటే ఏ పనైనా చేసుకోవచ్చు - మొక్కలు నాటుతూ - తోట పని కూడా చేయవచ్చు. ఎవరికైనా రియాలిటీ ఎక్స్ పీరియెన్స్ కావాలనుకుంటే ఒకసారి ప్రయత్నించొచ్చు!!