మాజీ సీఎం మాజీ భార్య చేత ఇల్లు ఖాళీ అలా?

Update: 2016-08-23 07:49 GMT
ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ సతీమణి. గతంలో ప్రభుత్వం కేటాయించిన ఇంటిని ఖాళీ చేయకుండా సతాయిస్తున్నారు. అధికారులు ఇప్పటికి ఎన్నో నోటీసులు ఇచ్చినా డోన్ట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంటిని ఖాళీ చేయాలని కోర్టు ఆర్డర్ వేస్తే.. ఆ ఆర్డర్ వచ్చిన అధికారులు ఏం చేశారన్నది చూస్తే ఆశ్చర్యమనించికమానదు. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న మాజీ సీఎం మాజీ సతీమణి ఇంటి ఖాళీ చేయించిన వ్యవహారాన్ని చూస్తే.. ఔరా అనుకోవాల్సిందే.

జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లా ఢిల్లీలోని ప్రభుత్వ నివాసంలో ఉంటున్నారు. లుటెన్స్ జోన్ లోని ఒక బంగళాలో ఆమె నివసిస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయాలన్న ఆదేశాల్ని ఆమె పట్టించుకోవటం లేదు. ఇదిలా ఉంటే.. ఆమె చేత ఇంటిని ఖాళీ చేయించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆర్డర్ కాపీని అందుకున్న అధికారులు పాయిల్ ఇంటికి వచ్చారు. సెక్యురిటీ గార్డు వారిని ఇంటి లోపలకు వెళ్లేందుకు అనుమతించకపోవటంతో తుగ్లక్ రోడ్ లోని పోలీసుల సహాయంతో గేటు తాళం బద్ధలు కొట్టి మరీ ఇంటి లోపలకు వెళ్లారు. ఆ సమయంలో పాయల్ ఇంట్లో లేకపోవటంతో ఆమె కోసం వెయిట్ చేశారు.

తర్వాత వచ్చిన పాయల్ మీడియాతో మాట్లాడలేదు. కొద్దిసేపటికి పాయల్ తరఫు న్యాయవాది వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో వస్తువుల్ని పోలీసులు విసిరేశారని.. పాయల్ పట్ల అనుచితంగా వ్యవహరించారని మండిపడ్డారు. సామాన్యు సర్దుకునే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. చివరకు రాత్రి పది గంటలు దాటిన సమయంతో కొద్దిపాటి సామాన్లు పట్టుకొని ఆమె తన వాహనంలో వెళ్లిపోయారు. కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకూ వెయిట్ చేసే కన్నా.. తనకు సంబంధం లేని ఇంటిని ముందే ఖాళీ చేసి ఉంటే ఇంతటి అవమానకర పరిస్థితులు ఎదరయ్యేవి కాదు కదా?
Tags:    

Similar News