డిజిటల్ లావాదేవీల దిగ్గజం పేటీఎంను వాడుతున్న యూజర్లకు శుభవార్త. ఆ సంస్థకు చెందిన వాలెట్ యాప్ ఉన్న ఫోన్ పోయినా లేదంటే వాలెట్ నుంచి డబ్బు తస్కరించబడినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేటీఎం ఇన్సూరెన్స్ ను అందిస్తోంది. ఇవాళ్టి నుంచే ఈ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చిందని పేటీఎం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎంలో ఉన్న యూజర్లందరికీ ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, అందుకు గాను వారు ఎలాంటి చార్జి చెల్లించాల్సిన పనిలేదని, ఈ ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితమని వారు తెలిపారు. పేటీఎం వాలెట్ ను వాడుతున్న యూజర్లందరికీ ఈ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిందని వారు పేర్కొన్నారు.
పేటీఎం అందిస్తున్న ఇన్సూరెన్స్ ద్వారా యూజర్లు సంవత్సరానికి ఒక క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలంటే... డివైస్ పోయినా, పేటీఎం వాలెట్ లో ఉన్న డబ్బు దొంగిలించబడినా పేటీఎం కస్టమర్ కేర్ నంబర్ +91 9643 979797 కు వినియోగదారుడు 24 గంటల్లోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ డివైస్ పోతే యూజర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పేటీఎం ఆ ఫిర్యాదును స్వీకరించి 5 రోజుల్లోగా తస్కరించబడిన మొత్తాన్ని యూజర్ వాలెట్ కు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అన్ని వివరాలను పరిశీలించాకే పేటీఎం డబ్బును ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ క్రమంలో యూజర్ కు చెందిన పేటీఎం వాలెట్ 5 రోజుల పాటు బ్లాక్ అవుతుంది. ఆ పైన కొత్త పాస్ వర్డ్ ను పేటీఎం ఇస్తుంది. దాంతో యూజర్ మళ్లీ అకౌంట్ లోకి లాగిన్ అయితే అప్పుడు పోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. పేటీఎం ఇలా గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే యూజర్ కు అందిస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/