చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరికి సుపరిచితమే కాదు.. దాదాపుగా అందరూ ఏదో ఒక సందర్భంలో వినియోగించే పేటీఎం పబ్లిష్ ఇష్యూ మదుపరులకు చుక్కలు చూపిస్తోంది. పేటీఎం మాతృసంస్థ ‘‘వన్ 97 కమ్యూనికేష్స్’’ పేరుతో స్టాక్ ఎక్స్జైంజ్ లో నమోదైన ఈ షేర్ తొలి రోజునే భారీ నష్టాల్ని మూటకట్టుకుంటే.. కొత్తగా మొదలై వారంలోనూ నష్టాల బాటలోనే పయనిస్తూ.. నమ్ముకున్నోళ్లందరిని నట్టేట ముంచేస్తోంది. దీంతో.. కంపెనీ విలువ మాత్రమే కాదు మదుపరుల సొమ్ము సైతం ఆవిరి అయిపోతోంది. భారీగా పతనమైన షేరు ధర అంతకంతకూ దిగజారిపోతోంది.
సోమవారం ఈ షేరు విలువ ఏకంగా 14 శాతం తగ్గిపోవటంతో.. గడిచిన నాలుగు రోజుల్లో పేటీఎంను నమ్ముకున్న వారంతా నట్టేట మునిగిపోతున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ షేరు.. ఇప్పుడు దాన్ని తలుచుకోవాలంటేనే భయపడిపోయే పరిస్థితి. పేటీఎం పబ్లిక్ ఇష్యూలో ఒక లాట్ లో 6 షేర్లుగా డిసైడ్ చేశారు.
ఇష్యూలో ఫిక్స్ చేసిన ధర ప్రకారం ఒక్కో షేరు రూ.2150. అంటే.. ఆరు షేర్ల లాట్ విలువ రూ.12,900. ఇంతవరకు బాగానే ఉన్నా.. గురువారం ఈ షేరును మార్కెట్లోకి తీసుకురావటం.. ఆ వెంటనే షేరు ధర అంత పలకపోవటంతో పాటు.. దాని విలువ తగ్గుతూ వస్తోంది.
తాజాగా పేటీఎం ఒక లాట్ విలువ రూ.8196కు పడిపోయినట్లు చెబుతున్నారు. ప్రారంభంలోని రూ.12,900తో పోలిస్తే.. ఒక లాట్ మీద ఏకంగా రూ.4704 నష్టం వచ్చింది. అంటే.. పెట్టిన పెట్టుబడిలో 36 శాతం ఆవిరి కావటమన్న మాట. ఎందుకిలా జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయాన్ని చూస్తే.. ఐపీఓలో షేరు ధర ఎక్కువగా నిర్ణయించటం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. పేటీఎంను మార్కెట్లోకి వచ్చే వేళ.. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.39 లక్షల కోట్లు కాగా.. అందులో తాజాగా రూ.56 వేల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో.. పేటీఎంను నమ్ముకున్న లక్షలాది మందికి భారీ నష్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితి.