జ‌గ‌న్ త‌న‌కు తానే భ‌య‌ప‌డ్డాడ‌ట‌

Update: 2016-10-17 17:16 GMT
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. నల్లధనం వెల్లడిపై జగన్‌ కే క్లారిటీ లేదని ఎద్దేవా చేసిన ప‌య్యావుల రూ.10వేల కోట్ల న‌గ‌దుపై పన్ను చెల్లించిన వ్య‌క్తి వివ‌రాలు తేల్చేందుకు జగన్ అవినీతి మూలాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ కు చెందిన హైదరాబాద్ వివరాలు కోరితే సరిపోదని, ఆయన మూలాలున్న ఢిల్లీ, ముంబై, కోల్ క‌తా నగరాల్లోని నల్ల సంప‌ద వివరాలు కూడా బహిరంగపరచాలని  పయ్యావుల డిమాండ్ చేశారు. దీంతో పాటుగా జ‌గ‌న్ పార్టీలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌పైనా ప‌య్యావుల రియాక్ట‌య్యారు.

టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ప‌య్యావుల రూ.10 వేల కోట్ల నల్లధనం గురించి ముఖ్యమంత్రి మాట్లాడగానే జగన్ ఎందుకు భుజాలు తడుముకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేవలం పత్రికల్లో వచ్చిన సమాచారాన్నే తెలిపారని, అంతమాత్రానికే జగన్ లేఖ రాసి, తనకు తానే బయటపడ్డాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన సొమ్ము నాది కాదు, నా బినామీలది కాదని జగన్ చెప్పలేకపోయారన్నారు. రాంకీ సంస్థ నుంచి విచారణ కొనసాగించాలని పయ్యావుల సూచించారు. రస్ అల్ ఖైమా దేశంలో పెట్టిన పెట్టుబడుల్లో కూడా అవినీతి జరిగిందని, దీనికి సంబంధించిన వారిపై కూడా నిఘా ఉంచి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అన్రాక్ సంస్థకు కేటాయించిన భూములపై కూడా విచారణ జరిపాలని ప‌య్యావుల అన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా ప్రాంతాల నుంచి వేలకోట్లు ఐడీఎస్ ద్వారా కేంద్రానికి చేరాయని వాటితో జగన్ అవినీతికి సంబంధం ఉందని ఆరోపించారు. అందుకే ఆయా ప్రాంతాల్లోని జగన్ సూటికేస్ కంపెనీలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. త్వరలోనే మరింతమంది అవినీతి వ్యవహారాలు బయటికొస్తాయని, జగన్ అవినీతిపై, ఆస్తులపై సీబీఐ గతంలో జరిపిన విచారణ అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ మధ్య కాలంలో ముగ్గురు వ్యక్తులు తరచూ టీడీపీ పై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని వారి వెనుక జగన్ ఉన్నారని పయ్యావుల ఆరోపించారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు రామ చంద్రయ్య - ఉండవల్లి  - రఘువీరారెడ్డి రాజకీయ మనుగడ కోసం విమర్శలు చేస్తున్నారని పయ్యావుల మండిపడ్డారు. ఈ మూడు పక్షులు త్వరలోనే జగన్ గూటికి చేరుతాయని, అందుకే జగన్‌ ను రక్షించడానికి టీడీపీ పై దుప్రచారానికి ఒడిగట్టాయని పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News